Skanda : ‘స్కంద’ నుండి ఊర మాస్ సాంగ్ రిలీజ్..
ఈ సాంగ్ లో రామ్ తనదైన ఎనర్జిటిక్ మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతేలా రామ్ తో కలిసి స్టెప్పులేసింది
- By Sudheer Published Date - 03:10 PM, Mon - 18 September 23

హీరో రామ్ (Ram) – మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ (Skanda ). ధమాకా ఫేమ్ శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని..రిలీజ్ కు సిద్దమైంది. ఈ నెల 28 న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ తరుణంలో మేకర్స్ సినిమా తాలూకా ప్రమోషన్ తో సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి రేపాగా..ఈరోజు వినాయకచవితి సందర్బంగా సినిమాలోని ఐటెం సాంగ్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.
‘కల్ట్ మామా’ అంటూ సాగే ఈ సాంగ్ ను హేమచంద్ర, రమ్య బెహరా, మహా ఆలపించగా.. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ లో రామ్ తనదైన ఎనర్జిటిక్ మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతేలా రామ్ తో కలిసి స్టెప్పులేసింది. పాటలో రామ్ డాన్స్ తో పాటు ఊర మాస్ లుక్ ఆకట్టుకుంటుంది. పొడవాటి జుట్టు గుబురు గడ్డం కండలు తిరిగిన దేహంతో రామ్ తన మేకోవర్ తో ఆశ్చర్యపరిచాడు.
Read Also : Tollywood : వివాదంలో హీరో నాగార్జున ఫ్యామిలీ..
ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మించగా.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ లో సీనియర్ హీరో శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు.