HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Six Movie Directors Changed Tollywood Way From Old Route

టాలీవుడ్ రూటు మార్చిన ఆరుగురు డైరెక్టర్లు.. రెమ్యునరేషన్ ఎంతంటే..!

  • Author : Hashtag U Date : 03-04-2022 - 11:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shooting
Shooting

ఇప్పుడంతా వందల కోట్ల బడ్జెట్ లెక్కనే. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రానున్న జేమ్స్ బాండ్ చిత్రం బడ్జెట్ 800 కోట్లు ఉంటుందని టాక్. అంటే టాలీవుడ్ రేంజ్ వెయ్యి కోట్లకు సమీపిస్తోంది. ఇది బాలీవుడ్ బడ్జెట్ కంటే ఎక్కువే అని చెప్పాలి. బడ్జెట్ వందల కోట్లలో ఉంటే… వసూళ్లు వేల కోట్లలో ఉంటున్నాయి. బాక్సాఫీసు రికార్డులు బద్దలవుతున్నాయి. విదేశాల్లోనూ తెలుగు ఇదంతా డైరెక్టర్ ఓరియంటెడ్ చిత్రాల చలవే అన్నవారు లేకపోలేదు. డైరెక్టర్ రేంజ్ ను, అతడి సక్సెస్ రేటును బట్టి సినిమా ఇమేజ్ ఆధారపడుతోంది. అలాంటి వారిలో రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ వంటివారున్నారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి… టాలీవుడ్ తోపాటు ఇండియన్ సినిమా రేంజ్ నే మార్చేశారు. బాహుబలితోనే సీన్ మారింది. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందించిన బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రపంచం దృష్టి మనవైపునకు మళ్లేలా చేశాడు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో మళ్లీ రికార్డులు బద్దలుకొట్టాడు.

తన కెరీర్ లో ఫ్లాప్ సినిమా అంటూ ఎరుగని దర్శకుడు రాజమౌళి. ఆయన తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్సే. అందుకే ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు రాజమౌళి. ఆయన రెమ్యూనరేషన్ కూడా ఒక్కసారిగా భారీగా పెరిగిపోయిందని టాక్. రాజమౌళి… సినిమా బిజినెస్ ను బట్టి 200 కోట్ల బడ్జెట్ కు దాదాపు 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకయితే షేర్స్ ద్వారానే బిజినెస్ డీల్ సెట్ చేసుకున్నారనే టాక్ కూడా ఉంది.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో మరొకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కు పేరు. భీమ్లా నాయక్ చిత్రంతో త్రివిక్రమ్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాల్లో కామెడీ, రొమాన్స్ పాత్ర ఎక్కువే. వీటన్నింటికీ మించి ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. భీమ్లా నాయక్ చిత్రంతో మరోసారి తన మార్కును చూపించాడు. త్రివిక్రమ్ ఎక్కువగా హారిక హాసిని క్రియేషన్స్ లోనే చిత్రాలు చేస్తుంటారు. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటారని టాక్. సినిమాను బట్టి 20 కోట్లకుపైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో మరొకరు సుకుమార్. పుష్ప, రంగస్థలం వంటి అద్భుత చిత్రాలను తెరకెక్కించి కొత్తదనం చూపించారు. ఆర్యతో ప్రారంభమైన ఆయన సినీ కెరీర్ అప్రతిహతంగా సాగిపోతోంది. సుకుమార్ చిత్రాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటాయి. సుకుమార్ చిత్రాల్లో లాజిక్ ఎక్కువగా కనిపిస్తుంది. సుక్కు డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. అందులో అల్లూ అర్జున్ ను చాలా కొత్తగా చూపించాడు. అల్లూ అర్జున్ స్టైల్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. హిందీతోపాటు ఇతర భాషల్లో రావడంతో దేశ వ్యాప్తంగా పుష్ప పాటలు, పుష్ప స్టైల్ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో పుష్ప సీక్వెల్ కు కూడా రెడీ అవుతున్నాడు. అందుకే రెమ్యూరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. పుష్ప సినిమా రెండు భాగాలకు కలిపి 30 కోట్లకుపైనే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్.

సినిమాను డైరెక్టర్ ఓరియంటెడ్ గా మార్చేసిన మరో టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ. భరత్ అనే నేను, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. సామాజిక బాధ్యత కలిగిన సినిమాలు నిర్మించి అన్ని వర్గాలను ఆకట్టుకోవడం ఈయన స్టైల్. పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ వచ్చేలా చేయడంలో కొరటాల శివ ఎక్స్ పర్ట్. రిస్క్ లేకుండా సినిమాను సేఫ్ జోన్ లో ఉంచుతారు. కొరటాల రెమ్యూరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు టాక్. చిరంజీవితో తీసిన ఆచార్య చిత్రానికి 13 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను కూడా సినిమాను డైరెక్టర్ ఓరియంటెడ్ గా మార్చేశారనే చెప్పాలి. విభిన్నమైన కథాంశాన్ని తెరకెక్కించడంలో దిట్ట. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీయడం బోయపాటి స్టైల్. అఖండ, వినయ విధేయ రామ, సింహా, లెజెండ్, దమ్ము, తులసి వంటి చిత్రాలను తెలుగువారికి అందించాడు. హీరోను ఎలివేట్ చేసే పాత్రలను సృష్టించడంలో బోయపాటికి తిరుగులేదు. పారితోషికం విషయంలో బోయపాటి రేంజ్ కూడా ఓ లెవల్లో ఉంది. ఒక్కో సినిమాకు 20 కోట్లు పైనే తీసుకుంటున్నట్టు టాక్.

లేడీ ఓరియంటెడ్, హీరో ఓరియంటెడ్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పూరి జగన్నాథ్… ఇప్పుడు సినిమాను డైరెక్టర్ ఓరియంటెడ్ గా మార్చేశారు. కొత్త స్టైల్లో సినిమా తీసే దర్శకుల్లో పూరి టాప్ లో నిలుస్తాడు. పంచ్ డైలాగ్స్, హీరో హీరోయిన్ ల స్టైల్ వంటివి పూరి చిత్రాల్లో కనిపిస్తాయి. మాస్ ప్రేక్షకులకు పూరి సినిమాలు బాగా కనెక్ట్ అవుతాయి. రొమాంటిక్, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇక పూరి సినీ కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచే చిత్రం పోకిరి. లైగర్ సినిమాతో బిజీగా ఉన్న పూరి కూడా ఒక్కో సినిమా 20 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్.

ఈ దర్శకుల చిత్రాల్లో చిన్న పాత్రలో మెరిసినా చాలనుకునే నటీనటులు ఎందరో ఉన్నారు. మొత్తానికి టాలీవుడ్ ను డైరెక్టర్ ఓరియంటెడ్ గా మార్చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • boyapati sreenu
  • koratala siva
  • puri jagannath
  • sukumar
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd