Sitara Ghattamaneni : సితార బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎంత పెద్ద కేక్ చూశారా?
ఇప్పటికే మహేష్ బాబు, నమ్రత స్పెషల్ గా సితారకు విషెష్ చెప్తూ పోస్టులు చేశారు.
- Author : News Desk
Date : 20-07-2024 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
Sitara Ghattamaneni : నేడు జులై 20న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని పుట్టిన రోజు. ఇప్పటికే మహేష్ బాబు, నమ్రత స్పెషల్ గా సితారకు విషెష్ చెప్తూ పోస్టులు చేశారు. ఇక ఉదయం నుంచి మహేష్ అభిమానులు, పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సితారకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.
తాజాగా నమ్రత శిరోద్కర్ సితార కేక్ తో ఉన్న ఫొటో షేర్ చేసి.. ఇవాళ్టికి 12 ఏళ్ళు. హ్యాపీ బర్త్ డే. లైఫ్ లో నీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలి. నువ్వు చాలా మంచిదానివి అంటూ పోస్ట్ చేసింది. ఇవాళ ఉదయం ఇంట్లోనే సితార ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. నమ్రత కేక్ తో ఉన్న ఫొటో షేర్ చేయడంతో ఎంత పెద్ద కేక్, చాలా కలర్ ఫుల్ గా బాగుంది అని ఆశ్చర్యపోతున్నారు. మరి సితార బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు మరిన్ని పోస్ట్ చేస్తారేమో చూడాలి.
Also Read : Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య చదువుకుంటుందా? అన్నా లెజనోవా గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కి పవన్..