HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sirish Reddy Game Changer

Game Changer : గేమ్ ఛేంజర్ తో మా జీవితాలు రోడ్డు మీదకే అనుకున్నాం – నిర్మాత శిరీష్

Game Changer : మాకు హీరో రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ ఒక్క కాల్ కూడా చేయలేదు. చిరంజీవి ఈ చిత్రాన్ని సెట్ చేసారు..ఆయన కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడాలేదు

  • Author : Sudheer Date : 01-07-2025 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sirish
Sirish

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం (Sri Venkateswara Creations ) నిర్మాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. నిర్మాత దిల్ రాజు (Dil Raju) కథలను నమ్మి సినిమాలు తీస్తూ తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. ఈ బ్యానర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలే కాదు భారీ డిజాస్టర్లు కూడా పడ్డాయి. అయితే ఈ బ్యానర్‌ను నిలబెట్టేందుకు తెరవెనుక దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి (Shirish)అహర్నిశలు శ్రమిస్తున్నారని అందరికి తెలిసిందే. కాగా ఈ బ్యానర్ లో ఇటీవల రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన గేమ్ ఛేంజర్ (Game Changer ) సినిమా డిజాస్టర్ అవ్వడమే కాదు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాతో తమ జీవితం కుదేలైందని భావించామని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో శిరీష్ వెల్లడించారు.

Ustaad Bhagat Singh : తమ్ముడి సెట్లో అన్నయ్య సందడి

“గేమ్ ఛేంజర్ వల్ల నష్టాలు చవిచూశాం. ఇలాంటి సమయంలో మాకు హీరో రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ ఒక్క కాల్ కూడా చేయలేదు. చిరంజీవి ఈ చిత్రాన్ని సెట్ చేసారు..ఆయన కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడాలేదు. అయితే మేము ఎవరినీ తప్పుపట్టడం లేదు. మేమే ఇష్టపడి సినిమా చేశాం, డబ్బులు పోగొట్టుకున్నాం. కానీ డిస్ట్రిబ్యూటర్లను మేము వదలలేదు. గేమ్ ఛేంజర్ తర్వాత అందరూ మీము రోడ్డున పడ్డట్లే అనుకున్నారు..మీము కూడా అలాగే భావించాం. అయితే అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా తిరిగి నిలబెట్టిందని, జీవితం మళ్లీ మారిపోయిందని శిరీష్ తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేకపోతే మా పరిస్థితి మరోలా ఉండేదని చెప్పుకొచ్చారు.

INS Tamal : భార‌తీయ నేవీలోకి కొత్త యుద్ధ నౌక‌..నేడు జ‌ల‌ప్ర‌వేశం

ఈ సినిమాతో వచ్చిన ఆదాయం వల్ల ‘గేమ్ ఛేంజర్’ నష్టాల్లో సుమారు 70 శాతం వరకు కవరయ్యిందని శిరీష్ పేర్కొన్నారు. “ఈ రోజు మేము తిరిగి నిలవగలిగామంటే, ఆ క్రెడిట్ పూర్తిగా అనిల్ రావిపూడికే చెందుతుంది. ఆయన లేకుంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ స్థాయిలో ఉండేది కాదని నేనెప్పుడూ నమ్ముతాను” అని తెలిపాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • Game Changer Flop
  • Game Changer Loss
  • ram charan
  • sankranthiki vasthunam
  • shankar phone call
  • sirish reddy game changer

Related News

Inca Award Bulliraju

INCA అవార్డు అందుకున్న బుల్లిరాజు

అవార్డు అందుకున్న అనంతరం బుల్లిరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తన ఈ విజయానికి దర్శకుడు అనిల్ రావిపూడి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అనిల్ రావిపూడి చిత్రాల్లోని కామెడీ సెన్స్, ఆయన తన పాత్రను తీర్చిదిద్దిన తీరు వల్లే తనకు ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందని బుల్లిరాజు

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd