Singer Sunitha In Green Challenge: ప్రకృతిని తల్లిలా చూసుకోవాలి!
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రముఖ గాయని సునీత పాల్గొన్నారు.
- By Balu J Published Date - 02:37 PM, Wed - 29 June 22

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రముఖ గాయని సునీత పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కులో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, భారతదేశంలోనే అతిపెద్ద ప్లాంటేషన్ ప్రోగ్రామ్‌లలో ఒకటైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. “మనం ప్రకృతిని మన తల్లిలా చూసుకోవాలి” అని చెప్పింది. భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడటానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గీత రచయితలు చంద్రబోస్, రామజిగయ్య శాస్త్రి, దర్శకురాలు నందినీ రెడ్డిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు సునీత.