S Janaki : ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ‘సామజవరగమన’ సాంగ్ పాడిన జానకమ్మ..
1980లో సంగీతాన్నే కథగా తీసుకోని కె విశ్వనాధ్ తెరకెక్కించిన సినిమా 'శంకరాభరణం'(Sankarabharanam). ఈ సినిమా నేషనల్ వైడ్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో చెప్పనవసరం లేదు.
- Author : News Desk
Date : 17-12-2023 - 9:54 IST
Published By : Hashtagu Telugu Desk
ఒకప్పటి సినిమాల్లో మాటలతో పాటు పాటలు కూడా ప్రధాన పాత్ర పోషించేవి. పాటలు కూడా కథలోని ఎమోషన్ ని తెలియజేసేలా మేకర్స్ తెరకెక్కించేవారు. ఆ పాటలకి సింగర్స్ తమ గాత్రంతో ప్రాణం పోసేవారు. ఇక 1980లో సంగీతాన్నే కథగా తీసుకోని కె విశ్వనాధ్ తెరకెక్కించిన సినిమా ‘శంకరాభరణం'(Sankarabharanam). ఈ సినిమా నేషనల్ వైడ్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. అప్పటి జాతీయ పురస్కారంలో మొత్తం నాలుగు అవార్డులను అందుకుంది. వీటిలో మూడు సంగీతానికి వచ్చినవే.
కాగా ఈ మూవీలో ప్రతి సాంగ్ ఎవర్ గ్రీన్. కెవి మహదేవన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాలో మొట్టమొదటి రికార్డు చేసిన పాట ‘సామజవరగమన’. ఈ సాంగ్ ని ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్ జానకి పాడారు. అయితే ఈ పాట రికార్డింగ్ టైములో జానకమ్మ(S Janaki) అస్వస్థకు గురయ్యారట. పాటలు రికార్డింగ్ స్టార్టింగ్ రోజు కావడంతో పూజా కార్యక్రమం నిర్వహించి.. అందరికి సంపంగి పూలమాలలు వేసి సత్కరించారు. అయితే జానకమ్మకి సంపంగి పూలు అంటే ఎలర్జీ అంటా. దీంతో ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది.
బాలసుబ్రమణ్యం ప్రథమ చికిత్స చేసేందుకు తనకి తెలిసిన ఒక మెడిసిన్ తెచ్చి జానకమ్మకు ఇచ్చారు. అది వేసిన తరువాత జానకమ్మకు ఇబ్బంది మరింత ఎక్కువ అయ్యింది. జానకమ్మ మొహం వాచిపోయి, కళ్ళు ఎర్రబడిపోయి, ఊపిరి తీసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారట. ఇక ఆమె పరిస్థితిని చూసిన ఎస్పీబీ ఆ విషయాన్ని అందరికి చెప్పడానికి ప్రయత్నిస్తే.. జానకమ్మ అడ్డుపడ్డారట. “మంచి రోజని ముహూర్తం పెట్టుకున్నారు. దానిని చెడగొట్టొద్దు. నేను పాడేస్తాను” అని చెప్పారట.
జానకమ్మ ఆజ్ఞతో ఆ విషయాన్ని ఎస్పీబీ ఎవరికి చెప్పలేదు. ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ‘సామజవరగమన’ సాంగ్ పాడి జానకమ్మ మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా చూసిన వారిలో చాలామందికి ఫేవరెట్, చూడని వాళ్ళకి కూడా ఈ సాంగ్ ఫేవరెట్ లిస్టులో ఉంటుంది. జానకమ్మ అంత ఇబ్బందిలో కూడా అంత బాగా పాడారు.
Also Read : Chiranjeevi : చిరంజీవి బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే..