Geetha Madhuri: మరోసారి తల్లి కానున్న సింగర్ గీతా మాధురి.. నెట్టింట ఫోటోస్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సింగర్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా పనిచయం అక్కర్లేదు. ఈమె నటుడు నందుని వివాహం చే
- By Nakshatra Published Date - 08:08 AM, Fri - 2 February 24
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ సింగర్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా పనిచయం అక్కర్లేదు. ఈమె నటుడు నందుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఎన్నో పాటలు పాడి సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది గీతామాధురి. అలాగే ఆమె భర్త నందు కూడా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. హీరోగా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు నందు. కాగా ఈ జంటది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే. 2014లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.
తమ ప్రేమ, అన్యోన్యత బంధానికి గుర్తింపుగానే 2019లో గీతా మాధురి- నందు దంపతులకు దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే నందు గీతా మాధురి మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం గీతా మాధురి ప్రెగ్నెంట్. ఇటీవల రెండోసారి గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్న గీతామాధురి త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో గీతకు గ్రాండ్గా సీమంతం నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు.
ఈ ఫంక్షన్లో గీత స్నేహితులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. సీమంతం సందదర్భంగా ఆకుపచ్చ, నారింజ రంగు కాంబినేషన్లో ఉన్న చీరలో మెరిసిపోయింది. ఇక వేదికను కూడా రకరకాల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ఇకపోతే ఆ మధ్య ఒకసారి మిగతా మాధురి నందు ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడంతో గీతామాధురి కొన్ని ఫోటోలను షేర్ చేసి ఆ వార్తలకు చెక్ పెట్టింది.
Related News
Urfi Javed: ఉర్ఫీ సమ్మర్ స్పెషల్ ఔట్ ఫిట్ మామూలుగా లేదుగా.. వేరే లెవెల్ అంటూ!
బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఉర్ఫీ జావేద్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్రమైన వేషధారణ. చిత్ర విచిత్రమైన వేషధారణతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ ని కూడా ఉంటుంది.