Singer Alka Yagnik: సింగర్ అల్కా యాగ్నిక్‌కు వినికిడి లోపం.. ఏమైందంటే..
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్ అరుదైన వినికిడి లోపంతో బాధపడుతున్నారు.
- Author : Pasha
Date : 18-06-2024 - 1:09 IST
Published By : Hashtagu Telugu Desk
Singer Alka Yagnik: ప్రముఖ బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్ అరుదైన వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఓ టూర్‌కు వెళ్లి వచ్చారు. టూర్ ముగించుకొని ముంబై ఎయిర్‌పోర్టులో విమానం దిగినప్పటి నుంచి అల్కా యాగ్నిక్ చెవులు వినిపించడం లేదు. ఈవిషయాన్ని తన అభిమానులకు తెలుపుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. చాలారోజులుగా అభిమానులు ఈవిషయాన్ని ఆరాతీస్తుండటంతో.. వారికి క్లారిటీ ఇచ్చేందుకు తాను ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని అల్కా వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నా చెవులు వినిపించకపోవడంతో వైద్యులను సంప్రదించాను. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇంద్రియ నాడీ వ్యవస్థ దెబ్బతిని నాకు వినికిడి లోపం వచ్చిందని నిర్ధారణ అయింది. ఈ సమస్య నుంచి నేను త్వరగా కోలుకోవాలని మీరు ప్రార్థించండి’’ అని అల్కా యాగ్నిక్ (Singer Alka Yagnik) కోరారు. “నా అభిమానులు, సహోద్యోగులకు చిన్న సూచన. మీరు సౌండ్ ఎక్కువగా పెట్టుకొని ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు వాడకండి. దీనివల్ల మీకు చెవుల సమస్యలు వస్తాయి. నేను ఇప్పుడు ఓ సమస్యను ఎదుర్కొంటున్నాను. ఈ కష్టకాలంలో నాతో నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరంతా ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలి’’ అని అల్కా యాగ్నిక్ తన పోస్టులో ప్రస్తావించారు.
Also Read :Tamanna Bathing : ప్రతి సండే నో స్నానం.. ఎందుకో చెప్పిన తమన్నా
వినికిడి లోపం రాకూడదంటే ఇవి చేయాలి
- గట్టిగా అరిచే వారికి చెవులు త్వరగా దెబ్బతింటాయి.
- వీలైనంత వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే వాతావరణంలో ఉండకూడదు.
- ఎక్కువగా సౌండ్ ఉండే ప్రదేశంలో పని చేయాల్సి వస్తే చెవులకు ఇయర్ ప్లగ్స్, ఇయర్ మఫ్స్ పెట్టుకోండి.
- ఇంట్లో టీవీ, హోమ్ థియేటర్‌లను తక్కువ సౌండ్‌తో వినండి.
- చెవులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి.
- మ్యూజిక్, ఇతరత్రా వీడియోలు, ఆడియోలు వినేటప్పుడు 60 శాతంలోపు వాల్యూమ్ పెట్టుకోండి.
- హెడ్‌ఫోన్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోండి.