HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Siddu Jonnalagadda Gives Hint On Tillu 3 Sequel Movie

Siddu Jonnalagadda: డీజే టిల్లు 3 గురించి హింట్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ.. ఈసారి మామూలుగా ఉండదంటూ?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా విడుదల కావడానికి మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సినిమాలో అనుపమ

  • Author : Anshu Date : 28-03-2024 - 7:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Siddu Jonnalagadda
Siddu Jonnalagadda

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా విడుదల కావడానికి మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అటు అనుపమలు మాత్రం సిద్దు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే గతంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా విడుదల అయి ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రెండో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు సాంగ్ లు,టీజర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. కాగా ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. డీజే టిల్లు కి మించిన వినోదాన్ని అందించడానికి టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. కాగా హీరో సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా సిద్దూ మాట్లాడుతూ.. డీజే టిల్లు సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు.

హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్ ని అందించడానికి కృషి చేశాం అన్నారు సిద్దు. అలాగే ఈ సీక్వెల్ పాత్రకి కొనసాగింపుగా ఉంటుందా? లేక కథకి కొనసాగింపుగా ఉంటుందా.? అన్న ప్రశ్నకు సిద్దు స్పందిస్తూ.. రెండింటికి కొనసాగింపుగా ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్ లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు, షాక్ లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు. కానీ అందరిని నవ్విస్తాడు అని చెప్పుకొచ్చారు సిద్దు జొన్నల గడ్డ.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Siddu Jonnalagadda
  • tillu 3movie
  • Tillu Square
  • tollywood

Related News

    Latest News

    • Telangana: మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త.. మహిళా శక్తి సూపర్ బజార్లు

    • Annamalai: బీజేపీకి అన్నామలై బిగ్ షాక్..

    • CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    • BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

    • HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd