Gill Crush on Rashmika: రష్మికపై శుభ్ మాన్ గిల్ క్రష్.. క్రికెటర్ రియాక్షన్ ఇదే!
చాలామంది క్రికెటర్స్ హీరోయిన్స్ తో లవ్ అఫైర్ నడిపిన ఘటనలు ఉన్నాయి.
- By Balu J Published Date - 04:37 PM, Wed - 8 March 23

క్రికెట్, సినిమాకు మంచి రిలేషన్ ఉంది. చాలామంది క్రికెటర్స్ హీరోయిన్స్ తో లవ్ అఫైర్ నడిపిన ఘటనలు ఉన్నాయి. పీకల్లోతు ప్రేమలో మునిగిన కొంతమంది క్రికెటర్స్ పెళ్లి కూడా చేసేసుకున్నారు. అయితే యంగ్ క్రికెటర్లపై రుమార్స్ రావడం సహజమే. అయితే తన బ్యాటింగ్ తో అదరగొడుతున్న గిల్ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రష్మిక ప్రేమలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. అలా ఎందుకు అంటున్నారు అంటే రీసెంట్ గా ఓ స్పెషల్ చిట్ చాట్ లో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే కుర్రాడు రష్మిక పేరు చెప్పాడు. అంతే అప్పటి నుంచి నేషనల్ క్రష్ రష్మిక కు శుభ్ మాన్ గిల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు రాయడం మొదలు పెట్టారు.
అయితే తనతో రష్మికని జత చేస్తూ వస్తున్న వార్తలను ఖండించాడు యువ క్రికెటర్. జస్ట్ ఇష్టం ఉంది అన్నంత మాత్రానా ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా అని అంటున్నాడు. కేవలం తన మీద ఉన్న అభిమానం తోనే అలా చెప్పాను తప్ప తనని అసలు ఒక్కసారి కూడా కలవలేదని అన్నాడు శుభ్ మాన్ గిల్. అప్పటికే ఇద్దరు సారా లతో తనపై చేసిన ట్రొల్స్ మీమ్స్ ని చూసి కంగారు పడిన శుభ్ మాన్ గిల్ లేటెస్ట్ గా తనని రష్మికతో లింక్ పెడుతూ వస్తున్న వార్తలని చూసి షాక్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్ లో రాణిస్తున్న శుభ్ మాన్ పై పుకార్లు రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

Related News

Rashmika: రష్మిక చేసే పనికి షాక్ లో అభిమానులు.. అసలేం జరిగిందంటే!?
ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా పలు భాషల్లో భారీ ప్రాజెక్ట్ లతో క్రేజీ హీరోయిన్ గా ఉంది రశ్మిక. ఈ ఏడాది విజయ్ తో నటించిన వారసుడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది రిలీజైన పది రోజులకే బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నుతో ఓటిటి