Shriya Saran: కూతురికి చెవులు కుట్టించిన శ్రియా దంపతులు.. ఫొటోస్ వైరల్?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్
- By Nakshatra Published Date - 05:45 AM, Fri - 15 July 22
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరి సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం శ్రియా సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తోంది. అప్పుడప్పుడు అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. కాగా శ్రియా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కొన్ని కారణాల వల్ల సినీ ఇండస్ట్రీకి దూరం అయిన విషయం తెలిసిందే. అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ మధ్య సినిమాలలో నటిస్తోంది.
కాగా ఈమె ఇటీవల విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ అజయ్ దేవ్ గన్ సరసన నటించిన విషయం తేలిసిందే. అయితే శ్రియా కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్త, కూతురితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తు ఉంటుంది. మూడు పదుల వయసు దాటినా కూడా 25 ఏళ్ల యువతుల కనిపిస్తూ ఉంటుంది.
కాగా శ్రేయ శరణం తన భర్త పిల్లలతో కలిసి ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ,తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రియా దంపతులు కూతురు రాధ కీ చెవులు కుట్టించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో శ్రియా తన కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకోగా ఆమె పక్కనే తన భర్త కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులు పాప చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Related News
Ram Charan : రామ్ చరణ్, శ్రియా ఒకే స్కూల్లో కలిసి యాక్టింగ్ నేర్చుకున్నారు.. అప్పటి వీడియో చూశారా..?
చరణ్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ కూడా యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.