HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Shock For Surya Karuppu Morning Shows Cancelled

Karuppu: సూర్య కరుప్పు కు షాక్.. మార్నింగ్‌ షోలు రద్దు

  • Author : Vamsi Chowdary Korata Date : 14-05-2026 - 10:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shock for Surya Karuppu Morning Shows Cancelled
Shock for Surya Karuppu Morning Shows Cancelled

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రానికి విడుదల రోజున ఊహించని అడ్డంకి ఎదురైంది. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం, మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఈరోజు ఉదయం ప్రదర్శితం కావాల్సిన ఎర్లీ మార్నింగ్ షోలు రద్దయ్యాయి.

ఆర్థికపరమైన సమస్యల కారణంగానే ఈ సినిమా విడుదల నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.50 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో సినిమాకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించలేదని సమాచారం. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పరిణామంతో భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్ షోలను రద్దు చేశారు. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు షోలను తొలగించి, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించాయి. సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్న తరుణంలో ఈ అవాంతరం ఎదురవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

“తప్పనిసరి పరిస్థితుల కారణంగా ‘కరుప్పు’ ఉదయం 9 గంటల షోలను రద్దు చేస్తున్నాం. అందరికీ మా క్షమాపణలు” అని నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోవైపు, “నిర్మాతలు సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు” అని దర్శకుడు ఆర్‌జే బాలాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితితో సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై గందరగోళం నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Suriya
  • Financial Issues
  • Karuppu
  • Kollywood
  • premiere shows cancelled
  • Tamil cinema
  • Tamil movie

Related News

Khushbu meets CM Vijay and presents her daughter's wedding card.

Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన భేటీ చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ సుందర్.. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. తన చిన్న కుమార్తె అవంతిక వివాహ వేడుకకు సంబంధించిన లగ్న పత్రికను విజయ్‌కు ఖుష్బూ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా తన భర్త, కుమార్తెలతో కలిసి ముఖ్యమంత్రితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకు

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Eggs Benefits: ఉడికించిన కోడిగుడ్లు తింటే గుండె సమస్యలు రావా..?

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd