Shishir Sharma : జల్సాలో మెయిన్ విలన్‌గా చేయాల్సింది.. పవన్ కళ్యాణ్ తండ్రిగా చేశాడు.. ఏమైంది..?
జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ కి తండ్రి పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ 'శిశిర్ శర్మ'. త్రివిక్రమ్ ఫస్ట్ విలన్ పాత్రకి శిశిర్ శర్మని అనుకున్నాడు.
- By News Desk Published Date - 10:00 PM, Sun - 20 August 23

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘జల్సా'(Jalsa). 2008 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పవన్ తో కామెడీ చేయిస్తునే మరో పక్క యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చూపించి ఆడియన్స్ చేత విజుల్స్ వేయించాడు త్రివిక్రమ్. ఇలియానా(Ileayana) మెయిన్ హీరోయిన్ గా నటించగా పార్వతీ మెల్టన్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో విలన్ గా ముకేష్ రిషి నటించాడు.
అయితే ఈ పాత్ర చేయాల్సింది ముకేష్ రిషి కాదట. ఈయన కంటే ముందు త్రివిక్రమ్ మరొకర్ని సెలెక్ట్ చేశాడు. అతను మరెవరో కాదు. ఇదే సినిమాలో పవన్ కళ్యాణ్ కి తండ్రి పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ ‘శిశిర్ శర్మ’. త్రివిక్రమ్ ఫస్ట్ విలన్ పాత్రకి శిశిర్ శర్మని అనుకున్నాడు. ఆయనతో కాస్ట్యూమ్ టెస్ట్ చేసి డైలాగ్స్ తో ఆడిషన్ కూడా చేశాడు. ఆయన డైలాగ్ డెలివరీ, కాస్ట్యూమ్ అంతా సెట్ అవ్వడంతో త్రివిక్రమ్.. ఈ సినిమాలో విలన్ గా మీరే చేస్తున్నారు అని చెప్పి ఫైనల్ చేసేశాడు. అయితే శిశిర్ శర్మ ఆ సమయంలో ఒక హిందీ టీవీ షో చేస్తున్నాడు.
Shishir Sharma about his first telugu film Jalsa & Trivikram. pic.twitter.com/ULyNYfsM3r
— Think!! (@27stories_) August 16, 2023
ఆ షో డైరెక్టర్ కి జల్సా ఆఫర్ గురించి చెప్పగా.. అతను మిమ్మల్ని ఒక్కరోజు కూడా వేరే ప్రాజెక్ట్ లోకి పంపించే ఛాన్సే లేదు అని చెప్పేశాడు. దీంతో ఆయన ప్లేస్ లోకి ముకేష్ రిషి వచ్చాడు. ఆ ఆఫర్ మిస్ అయ్యినందుకు శిశిర్ శర్మ చాలా బాధ పడ్డాడట. త్రివిక్రమ్ కూడా అలానే ఫీల్ అయ్యాడట. అందుకనే మూవీలో చాలా చిన్న రోల్ అయిన పవన్ తండ్రి పాత్రని ఆయనే చేయాలని పట్టుపట్టి శిశిర్ శర్మతో చేయించాడు. అలా విలన్ రోల్ మిస్ అయినా తండ్రి పాత్రలో మెరిశాడు. ఇక ఇది శిశిర్ శర్మకు మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.
Also Read : Mahesh Babu : గుంటూరు కారం సంక్రాంతికి ఫిక్స్.. డౌట్స్ ఏం పెట్టుకోకండి..