Shanmukh Jaswanth Bail : గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్‌కు భారీ ఊరట
- By Sudheer Published Date - 01:41 PM, Fri - 23 February 24

గంజాయి కేసులో అరెస్ట్ అయినా ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth )కు బెయిల్ లభించింది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ ..బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయినా సంగతి తెలిసిందే. తెలుగులో షణ్ముఖ్ అత్యధిక సబ్ స్క్రైబర్స్ తెచ్చుకున్న సింగిల్ యూట్యూబర్ గా రికార్డ్ కూడా సాధించాడు. యువత పెద్ద ఎత్తున షణ్ముఖ్ అంటే పడిచస్తారు..సినీ హీరోలకు మించి ఇతడికి అభిమానులు ఉన్నారు. అలాంటి షణ్ముఖ్ .,.గంజాయి తో పట్టుబడడం అందర్నీ షాక్ కు గురి చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
షణ్ముక్ (Shanmukh Jaswanth ) అన్న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని సంపత్‌పై మౌనిక అనే యువతీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ప్లాట్‌కు వెళ్లారు. పోలీసులు అక్కడ తనిఖీలు జరుపగా… అక్కడ షణ్ముఖ్ గంజాయి (Ganja )తో అడ్డంగా బుక్కయ్యాడు. మౌనిక వీడియో తీస్తుండగా డ్రగ్స్ మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీయోద్దంటూ రచ్చ చేశాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 16 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా జస్వంత్ తరపున న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర బెయిల్ అప్లై చేసి.. ఆయనను బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని దిలీప్ సుంకర తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దిలీప్ షేర్ చేసిన ఫొటోలో షణ్ముఖ్ ఉన్నాడు. షణ్ముఖ్ తరుపున దిలీప్ సుంకర కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో షణ్ముఖ్‌కు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ అంటున్నారు. అయితే షణ్ముఖ్‌కు జరిపిన వైద్య పరీక్షల్లో అతడు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ జరిగినట్లు తెలుస్తోంది.
Read Also : Devi Sri : మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ఇంట సంబరాలు..