Shah Rukh Watch Collections: షారుఖ్ ధరించిన వాచ్ అక్షరాల కోటి 22 లక్షలు
మూడు పూటలా తిండి దొరకని పరిస్థితి నుంచి వందలాది మందికి తిండి పెట్టె స్థాయికి ఎదిగారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. కస్టపడి అంచలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు
- By Praveen Aluthuru Published Date - 10:51 AM, Sun - 17 September 23

Shah Rukh Watch Collections: మూడు పూటలా తిండి దొరకని పరిస్థితి నుంచి వందలాది మందికి తిండి పెట్టె స్థాయికి ఎదిగారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. కస్టపడి అంచలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు. 6 రూపాయల కోసం పని చేసిన దగ్గర్నుంచి 6000 కోట్ల ఆస్తిని సంపాదించాడు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగిన ఖాన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన కింగ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. కమర్షియల్ గా ఈ చిత్రం భారీ విజయం సాధించింది. తాజాగా సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ అందర్నీ ఆకర్షించింది. లగ్జరీగా కనిపించే బ్లు కలర్ వాచ్ గురించి నెటిజన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇంతకీ షారుఖ్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతంటే అక్షరాల కోటి రూపాయలకు పైగానే. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ముంబయిలో ‘జవాన్’ విజయోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రెస్‌మీట్‌లో కింగ్‌ఖాన్ ధరించిన వాచ్ పటేక్ ఫిలిప్. దీని ధర రూ. 1.22 కోట్లు. ప్రస్తుతం ఈవాచ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. కింగ్ ఫ్యాన్స్ అయితే కింగ్ ఎప్పటికీ కింగ్ ఏ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
షారుఖ్ వద్ద ఉన్న లగ్జరీ వాచ్ కలెక్షన్:
Patek Philippe Nautilus 5711/1A
Patek Philippe Aquanaut 5968A
Rolex Cosmograph Daytona
Tag Heuer Carrera Calibre 1887 SpaceX
Tag Heuer Monaco Sixty Nine
Audemars Piguet Royal Oak Perpetual Calendar
Also Read: Amit Shah : తెలంగాణ సాయుధ పోరాటయోధుల త్యాగాలు అనన్య సామాన్యం : అమిత్ షా