News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Senior Actress Suhasini In Controversy Praising Hindi And Hindi People

Actress Suhasini: వివాదంలో సీనియర్ నటి సుహాసిని

అసలే దక్షిణాది రాష్ట్రాలన్నీ హిందీ భాషపై అప్రకటిత యుద్ధం చేస్తుంటే.. సీనియర్ నటి సుహాసిని మాత్రం హిందీ భాష మంచిదని.. హిందీ మాట్లాడేవారు మంచివాళ్లంటూ పొగిడారు.

  • By Hashtag U Updated On - 11:15 PM, Wed - 4 May 22
Actress Suhasini: వివాదంలో సీనియర్ నటి సుహాసిని

అసలే దక్షిణాది రాష్ట్రాలన్నీ హిందీ భాషపై అప్రకటిత యుద్ధం చేస్తుంటే.. సీనియర్ నటి సుహాసిని మాత్రం హిందీ భాష మంచిదని.. హిందీ మాట్లాడేవారు మంచివాళ్లంటూ పొగిడారు. హిందీవారితో మాట్లాడాలంటే ఆ భాష నేర్చుకోవాలన్నారు. పనిలో పనిగా తమిళులు కూడా మంచివారని చెప్పేశారు. అక్కడితో ఆగితే వివాదం పెద్దగా ఉండేది కాదు. కానీ అసలు హిందీ అంటేనే అగ్గిమీద గుగ్గిలమయ్యే తమిళులను హిందీ నేర్చుకోమని సలహా ఇవ్వడం, వారు హిందీ నేర్చుకుంటే సంతోషమేనని చెప్పడంతో ఆమెపై విమర్శల యుద్ధం మొదలైంది.

తన ప్రసంగం చివర్లో మాత్రం అన్ని భాషలూ మంచివేనని, ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత మేలని చెప్పుకొచ్చారు. కానీ ఈ మాటలు కన్నా.. హిందీ భాష మంచిదని.. తమిళులు కూడా హిందీ నేర్చుకోవాలన్న వ్యాఖ్యలు పై ఇప్పటికే ఆమెపై విమర్శలు మొదలయ్యాయి. తమిళగడ్డపై హిందీ భాషపై వ్యతిరేకత ఇప్పటిది కాదు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే కూడా హిందీకి వ్యతిరేకంగా పోరాటం
చేస్తోంది.

సుహాసినీ ఇలా మాట్లాడడానికి కారణం.. ఆమె భర్త మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమా హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. భారీ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. అయితే హిందీ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి, ప్యాన్ ఇండియా సినిమాగా దానిని నిలబెట్టడం కోసమే సుహాసిని అలా హిందీకి అనుకూలంగా మాట్లాడారన్న అభిప్రాయం లేకపోలేదు. కానీ ఇది తమిళనాట ఆమెకు వ్యతిరేక పవనాలు వీచేలా చేస్తుందా.. పొన్నియన్ సెల్వన్ సినిమా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

Tags  

  • hindi language
  • suhasini

Related News

Hindi Language Controversy:హిందీ భాషపై ట్వీట్ వార్.. సుదీప్ కామెంట్స్ కు రాజకీయ మద్దతు వెనుక అసలు ఉద్దేశమేంటి?

Hindi Language Controversy:హిందీ భాషపై ట్వీట్ వార్.. సుదీప్ కామెంట్స్ కు రాజకీయ మద్దతు వెనుక అసలు ఉద్దేశమేంటి?

భాష ఘోష హద్దులు దాటుతోంది. కన్నడ నేల నుంచి ఢిల్లీ గల్లీ వరకు మంట రాజేస్తోంది.

  • Bollywood Vs Sandalwood: అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ మధ్య ట్వీట్ వార్…హిందీనే గొప్ప అంటూ..!!

    Bollywood Vs Sandalwood: అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ మధ్య ట్వీట్ వార్…హిందీనే గొప్ప అంటూ..!!

Latest News

  • Kiran Kumar Reddy: సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ!

  • Bengaluru Rains : వైప‌రిత్యాల నివార‌ణ‌కు మంత్రుల‌తో టాస్క్ ఫోర్స్

  • Rs 1 Lakh Umbrella: అదిదాస్, గుక్సీ.. గొడుగు కాని గొడుగు @ 1 లక్ష

  • Humanity Video: మానవత్వం పరిమళించే.. పిచుకమ్మ గొంతు తడిచే

  • RBI New Rules : ఇక కార్డ్ లేకుండా ఏటీఎంల‌లో డ‌బ్బు విత్ డ్రా

Trending

    • Air India : `ఎయిర్ ఇండియా విమానం` టేకాఫ్ గంద‌ర‌గోళం

    • Canadian MP in Kannada: కెనడా పార్లమెంట్ లో కన్నడం…ఉపన్యాసం దంచికొట్టిన ఎంపీ..వీడియో వైరల్..!!

    • Ram Charan on NTR B’day: నువ్వు నాకేంటో చెప్పేందుకు నా దగ్గర పదాలు లేవు…రాంచరణ్ ఎమోషనల్ ట్వీట్..!!

    • Thalapathy Vijay: విజయ్ వచ్చింది కేసీఆర్ కోసం కాదా? పీకేను కలవడానికా?

    • 206 Kidney Stones: కిడ్నీలో 206 రాళ్లు…తొలగించిన వైద్యులు..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: