Manchu Vishnu -Meena : మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్న మీనా.. థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్..
తాజాగా మంచు విష్ణు చేస్తున్న పనిని సీనియర్ హీరోయిన్ మీనా సపోర్ట్ చేసి, థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్ చేసింది.
- By News Desk Published Date - 09:58 AM, Tue - 30 July 24

Manchu Vishnu -Meena : మంచు విష్ణు ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ట్రోల్స్ చేసే యూట్యూబర్స్ కి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నటీనటులపై, వారి పర్సనల్ లైఫ్ పై ట్రోల్స్ చేసే యూట్యూబ్ ఛానల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు ప్రకటించారు. చెప్పినట్టే ఇప్పటికే దాదాపు 20 కి పైగా ఛానల్స్ ని మూయించాడు. ఈ విషయంలో మంచు విష్ణు కొంచెం సీరియస్ గానే పని చేస్తున్నాడు.
తాజాగా మంచు విష్ణు చేస్తున్న పనిని సీనియర్ హీరోయిన్ మీనా సపోర్ట్ చేసి, థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్ చేసింది. మీనా తన సోషల్ మీడియాలో మంచు విష్ణు గురించి వచ్చిన న్యూస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. తప్పుడు కంటెంట్ ని జనాల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మంచు విష్ణు తీసుకున్న యాక్షన్ కు ధన్యవాదాలు. ఇండస్ట్రీని కాపాడటానికి మీరు చేసే పనిని అభినందించాలి. ఈ విషయంలో నటీనటులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నెగిటివ్ కామెంట్స్ ని ఎదురించడంలో, మన సంఘాన్ని కాపాడటంలో అందరం కలిసి పోరాడాలి. ఈ విషయంలో మీరు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారని భావిస్తున్నాను. మంచు విష్ణు చాలా మంచి పనిచేసారు అని అభినందించింది.
గతంలో మీనా భర్త చనిపోయినప్పుడు పలు యూట్యూబ్ ఛానల్స్ ఇష్టమొచ్చినట్టు మీనాపై వార్తలు రాశారు. దీన్ని మీనా అప్పుడే ఖండించింది. అందుకే ఇప్పుడు మంచు విష్ణు కూడా తప్పుడు వార్తలు రాసే యూట్యూబ్ ఛానల్స్ పని పడుతుండటంతో మీనా సపోర్ట్ చేస్తూ అభినందిస్తుంది.
Also Read : Tamil Film Industry : తమిళ్ సినీ పరిశ్రమలో నిర్మాతలు వర్సెస్ నటీనటులు.. సినిమాల పరిస్థితి ఏంటి?