HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Seetha Ramam Bigger Than Life Story

Salman Dulquer: సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ!

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'సీతా రామం'

  • By Balu J Published Date - 09:15 PM, Sat - 23 July 22
  • daily-hunt
Seetha Ramam
Seetha Ramam

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు లో హను రాఘవపూడి మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సీతా రామం’ చిత్ర విశేషాలివి.

మీరు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తవుతుంది. ఈ ప్రయాణం ఎలా అనిపించింది ? పదేళ్ళలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేయడానికి కారణం ?
మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. ఐతే నిర్మాత సాయిగారు ఇచ్చిన స్వేఛ్చ వలన చాలా సౌకర్యంగా పని చేశాను. ఆ సినిమాకి మొదట్లో సక్సెస్ అని రాలేదు. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ చేశాను. అయితే ఈ గ్యాప్ లో కొంత కష్ట సమయం ఎదురైయింది. రానా గారితో అనుకున్న ఒక సినిమా బడ్జెట్ కారణాల వలన కుదరలేదు. లై, పడి పడి లేచే మనసు ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వచ్చింది. ఐతే నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందలేదు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ అలోచించలేదు. క్రాఫ్ట్ తెలిసుంటే ఏ పరిశ్రమలోనైనా పని వుంటుందని నమ్ముతాను.

జయాపజయాలకు సంబంధం లేకుండా మీ సినిమా వస్తుంటే ఒక అంచనా వుంటుంది కదా ? దీనికి కారణం ఏమిటని భావిస్తున్నారు ?
అంచనాలని క్రియేట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఒక మనిషికి ఒకసారి గౌరవించామంటే ఆ గౌరవం ఎప్పుడూ వుంటుంది. తప్పు చేస్తే తప్ప అది బ్రేక్ అవ్వదు. ఒక సినిమా బాలేదని అనుకుంటే ఆ సినిమా వరకే అనుకుంటారు కానీ తర్వాత వచ్చిన సినిమాకు అది వర్తించదు. బహుశా అదే కారణం అనుకుంటాను.

సీతారామంపై మంచి అంచనాలు వున్నాయి. సినిమా ఈ అంచనాలని అధిగమిస్తుందా ?
ఖచ్చితంగా అధిగమిస్తుంది. సీతారామం చాలా ప్రత్యేకమైన చిత్రం. సినిమా చూడటానికి మొదట కావలసింది క్యురీయాసిటీ. సీతారామం థియేటర్ లోనే చూడాలనే ఎక్సయిట్ మెంట్ , క్యురియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది. థియేటర్ లోకి వచ్చిన తర్వాత సీతారామం అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు.

సీతారామం కథకు ప్రేరణ ఉందా ?
నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు వుంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయి కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం వుండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా వుండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ అలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్.

తెలుగులో ఇంత మంది వుండగా దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ? సౌత్ మార్కెట్ ని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా?
కథ రాసినప్పుడు మైండ్ లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో వున్నవాళ్ళంతా ఆ సమయంలో బిజీగా వున్నారు. నేను, స్వప్న గారు కలసి దుల్కర్ ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ.

సీతారామం పాటలు బావున్నాయి.. సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖర్ ని తీసుకోవడానికి కారణం ?
విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆతనితో పని చేయడం చాలా సౌకర్యంగా వుంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి వుంది, ప్రతిది స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం వుండదు. ఇందులో మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. సీతారామం పాటలకు వృధ్యాప్యం రానేరాదు.

పదేళ్ళ సినిమా ప్రయాణంలో దర్శకుడిగా ఏం నేర్చుకున్నారు ?
పదేళ్ళుగా నేర్చుకున్నది రేపటికి మారిపోవచ్చు. ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే.

‘సీతారామం’ 1964 నేపధ్యంలోనే సినిమా నడుస్తుందా ?
ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి గతానికి నడుస్తూ వుంటుంది.

రష్మిక మందన పాత్రకు ఎంత ప్రాధాన్యత వుంటుంది ?
రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే.

‘యుద్ధంతో రాసిన ప్రేమ’ కథ ఏమిటి ?
బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. ‘యుద్ధంతో రాసిన ప్రేమ’ ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది. ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం.,సంఘర్షణ వుంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో వుంటుంది.

టీజర్ లో సీతా పేరుతో వచ్చిన లెటర్ అడ్రస్ మారి వస్తుందా?
టీజర్ లో చెప్పినట్లు రామ్ ఒక అనాధ. కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక సైనికుడు. రేడియోలో తన గురించి ఒక కార్యక్రమం ప్రసారం అవుంతుంది. తను అనాధ అని తెలిసిన తర్వాత చాలా మంది అతనికి ఉత్తరాలు రాశారు. అలా వచ్చిన ఒక సర్ప్రైజ్ లెటర్ తన జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆ లెటర్ లో ఏముందో ఇప్పటికి సస్పెన్స్. ఆ లెటర్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ జరుగబోతుందో అదే సీతారామం కథ.

లెటర్ కమ్యునికేషన్ చాలా సున్నితమైన అంశం కదా.. ఎలా డీల్ చేశారు ?
ఉత్తరం అనేది చాలా ప్రత్యేకమైన ఎమోషన్. ప్రేమ కథకి కమ్యునికేషన్ ప్రధాన సమస్య. ఒకప్పుడు ప్రేమ కథలు చాలా హృద్యంగా ఉండటానికి కారణం.. ఇప్పుడంత కమ్యునికేషన్ లేకపోవడమేనని భావిస్తా. ఉత్తరంలో ఎమోషన్ వేరు. ఆ మ్యాజిక్ మిస్ అయిపోయాం. ఆ మ్యాజిక్ ని బాగానే డీల్ చేశానని అనుకుంటున్నా.

వైజయంతి మూవీస్ లో పని చేయడం ఎలా అనిపించింది ? కథని ఒప్పించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏమిటి?
వైజయంతి మూవీస్ లో చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కాగితం మీద వున్నది స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దీనిని బలంగా నమ్మే నిర్మాత వుండాలి. వైజయంతి మూవీస్, స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం వున్న నిర్మాతలు.
కథ ఒప్పించడానికి ప్రయత్నించకూడదు. కథ బావుండాలి. కథ బావుంటే అన్నీ జరిగిపోతాయి. సినిమా అనేది నచ్చితేనే చేస్తారు. అందులో వైజయంతి మూవీస్ మరింత క్లారిటీ గా వుంటుంది.

సీతారామం షూటింగ్ ప్రాసస్ లో ఎలాంటి సవాల్ ఎదురయ్యాయి ?
ప్రకృతి ప్రాధాన సవాల్. కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో మైనస్ డిగ్రీలలో షూట్ చేశాం. ఇది కొంచెం టఫ్ జాబ్. మిగతావి పెద్ద కష్టపడింది లేదు.

మీ సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన సినిమాలు ఏవి ?
సీతారామం, అందాల రాక్షసి. ఈ రెండు నా మనసు దగ్గరగా వున్న చిత్రాలు.

మీ లైఫ్ లో ప్రేమ కథ ఉందా ?
లేదండీ. మన జీవితంలో ఏది ఉండదో అదే కోరుకుంటాం. అందుకే లవ్ స్టోరీస్ చేస్తున్నా (నవ్వుతూ)

మీ అభిమాన రచయిత ?
చలం గారి పుస్తకాలు చాలా చదివాను. ఇప్పుడు రాస్తున్న వెంకట్ సిద్దా రెడ్డి లాంటి రచయితల పుస్తకాలు కూడా చదువుతుంటాను.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
బాలీవుడ్ లో సన్నీ డియోల్, నవాజ్ తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమోజన్ తో ఒక వెబ్ సిరిస్ ప్లాన్ వుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ashwini dutt
  • priyanka dutt
  • Rashmika Mandanna
  • salman dulquer
  • Seetha Ramam
  • swapna cinema

Related News

    Latest News

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd