HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Secrets Told By Suma And Rajeev On Their 25th Wedding Day

Suma: పెళ్లిరోజున అలాంటి సీక్రెట్స్ రివీల్ చేసిన సుమ, రాజీవ్.. వీడియో వైరల్?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల ఆమె భర్త రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజీవ్ కనకాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటిం

  • Author : Anshu Date : 16-02-2024 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 16 Feb 2024 11 09 Am 9385
Mixcollage 16 Feb 2024 11 09 Am 9385

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల ఆమె భర్త రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజీవ్ కనకాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సుమ యాంకర్ గా ఎన్నో షోలకు వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సుమ చాలా వరకు టీవీ షోలను తగ్గించి యూట్యూబ్ ఛానల్ పై బాగా ఫోకస్ పెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవలె సుమ కనకాల కొడుకు రోషన్ బబుల్ గమ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇకపోతే తాజాగా సుమ ఆమె భర్త రాజు ఇద్దరు వారి 25వ పెళ్లిరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో, ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా సుమ తన ఛానెల్‌లో భర్త రాజీవ్‌తో కలిసి సందడి చేసారు. వారి పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సుమ-రాజీవ్‌లది ప్రేమ వివాహ కాగా మొదట్లో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా తర్వాత ఒప్పుకున్నారు. పెళ్లయ్యాక ఇద్దరు వారి వారి కెరియర్స్‌లో బిజీ అయిపోయారు. ఓవైపు పిల్లల బాధ్యతలు నెరవేరుస్తూనే కెరియర్‌లో ముందుకు సాగుతున్నారు. 25వ పెళ్లిరోజును వృద్ధాశ్రమంలో పెద్దల మధ్యలో వేడుకగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి దండలు మార్చుకుని అక్కడి వారందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఆ తర్వాత సుమ సొంత యూట్యూబ్ ఛానెల్‌లో సరదాగా చిట్ చాట్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పెళ్లైన కొత్తలో మీ భార్యకు టైమ్ ఇవ్వండి. ఆ తర్వాత ఇవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే ఆ తర్వాత వాళ్లు రివేంజ్ తీర్చుకోవడం మొదలుపెట్టారంటే వేరేలా ఉంటుంది.. అంటూ రాజీవ్ సుమని ఉద్దేశించి అన్నారు. ఇంటికి వచ్చేస్తున్నానని చెబుతూ రాజీవ్ చాలాసార్లు అబద్ధాలు చెప్పి ఆలస్యంగా వచ్చేవారిని సుమ కంప్లైంట్ చేసారు. అందుకు రాజీవ్ సుమకి సారీ చెప్పారు. రాజీవ్ మొదటిసారి సారీ చెప్పారంటూ సుమ మురిసిపోయారు. పెళ్లైన తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు టైమ్ ఇచ్చుకోవాలని ముఖ్యంగా పిల్లల విషయంలో బాధ్యతలు పంచుకోవాలని సుమ అన్నారు. మీరు ఎప్పుడైనా ఒకరి ఫోన్ లు ఒకరు చెక్ చేశారా అని అనగా నేనెప్పుడూ అలా చెక్ చేయలేదు అని రాజీవ్ చెప్పడంతో నేను చెక్ చేశాను అని సుమా తెలిపింది. ఎప్పుడు చూసావు అంటూ రాజీవ్ అడగటం.. అందుకు సుమ ఇది జరిగి పది సంవత్సరాలు అయ్యిందని అయినా ఏమీ కనిపించలేదని చెప్పారు. అందుకు రాజీవ్ జాగ్రత్త పడటంలో కింగ్ నేను.. నీకు అర్ధం కాని పేర్లతో సేవ్ చేసాను. అనగానే సుమ వైఫ్ లు జాగ్రత్త పడండి అంటూ నవ్వేసారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • marriage anniversary
  • Rajeev Kanakala
  • Suma
  • Suma Kanakala
  • tollywood

Related News

Beautiful actress Bhagyashree Borse finally scores a hit.

Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఉన్నంత మాత్రాన సరిపోదు.. బాక్సాఫీస్ వద్ద విజయం కూడా వరిస్తేనే ఇక్కడ క్రేజ్ నిలబడుతుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే సత్యాన్ని ఎదుర్కొంది. రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ లాంటి భారీ పరాజయంతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత చేసిన సినిమాలు కూ

  • How much is Sreeleela's income? What are her monthly earnings?

    Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd