HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Santosh Sobhan Faria Abdullah Merlapaka Gandhi Aamuktha Creations Niharika Entertainments Like Share Subscribe First Look Out

Santosh Sobhan & Faria Abdullah: ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్!

వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ

  • By Balu J Updated On - 11:29 AM, Tue - 6 September 22
Santosh Sobhan & Faria Abdullah: ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్!

వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని సూపర్‌హిట్‌లను సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్‌తో ఒక సినిమా చేస్తున్నారు. సంతోష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్’ ఏక్ మినీ కథ’ కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ ప్లే అందించినందున వారి క్రేజీ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది.

యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌లో సంతోష్ శోభన్ జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్యామ్ సింగరాయ్‌’ ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి లైక్ షేర్ చే సబ్‌స్క్రైబ్ అనే క్రేజీ టైటిల్ పెట్టారు. ఇవి యూట్యూబ్ లో వీడియో కంటెంట్‌ను ప్రచారం చేయడానికి ఉపయోగించే సాధారణ పదాలు. ప్రతి పదాన్ని సూచించే చిహ్నాలతో టైటిల్ లోగో చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది.

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ అడవిలో, టాప్ యాంగిల్‌లో విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే సినిమా కథ చాలా విలక్షణంగా ఉండబోతోందని అర్ధమౌతోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

Tags  

  • Fariya Abdullah
  • first look
  • Like Share & Subscribe
  • santhosh shoban

Related News

Ravi Teja First look Teaser: మెగా ‘మాస్’ యాక్షన్.. ఏసీపీగా రవితేజ అదుర్స్!

Ravi Teja First look Teaser: మెగా ‘మాస్’ యాక్షన్.. ఏసీపీగా రవితేజ అదుర్స్!

రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. వాల్తేరు వీరయ్య మూవీలో ఏసీపీగా కనిపించి అదుర్స్ అనిపించాడు.

  • Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి  రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్.. మామూలుగా లేదుగా?

    Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్.. మామూలుగా లేదుగా?

  • Neha Shetty: ‘బెదురులంక 2012’లో చిత్రగా నేహా శెట్టి, ఫస్ట్ లుక్ రిలీజ్!

    Neha Shetty: ‘బెదురులంక 2012’లో చిత్రగా నేహా శెట్టి, ఫస్ట్ లుక్ రిలీజ్!

  • Naga Chaitanya: నాగచైతన్య ‘కస్టడీ’.. క్యూరియాసిటీ పెంచుతున్న మూవీ పోస్టర్!

    Naga Chaitanya: నాగచైతన్య ‘కస్టడీ’.. క్యూరియాసిటీ పెంచుతున్న మూవీ పోస్టర్!

  • NC22 Poster: పోలీస్ గా నాగచైతన్య.. ఆసక్తిరేపుతున్న NC22 లుక్!

    NC22 Poster: పోలీస్ గా నాగచైతన్య.. ఆసక్తిరేపుతున్న NC22 లుక్!

Latest News

  • Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

  • Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

  • YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

  • Kuppam : కుప్పం మున్సిపల్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన వైసీపీ కౌన్సిల‌ర్లు.. కార‌ణం ఇదే..?

  • Thalapathy 67: ‘మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్.. భారీ స్టార్ కాస్ట్ తో విజయ్ మూవీ!

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: