HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sankranthiki Vasthunnam Sequel

Sankranthiki Vasthunnam Sequel : ‘సంక్రాంతికి వస్తున్నాం’ కు సీక్వెల్ రాబోతోంది..!

Sankranthiki Vasthunnam Sequel : 'మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకు ఆ స్పేస్ ఉంది. రాజమండ్రిలో ఎండ్ అయింది కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ కావొచ్చు'

  • Author : Sudheer Date : 19-01-2025 - 7:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
sankranthiki vasthunnam sequel
sankranthiki vasthunnam sequel

విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

2025 సంక్రాంతి (Sankranti ) బరిలో అసలైన బ్లాక్ బస్టర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthi Vasthunnam ) మూవీ నిలిచింది. సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారని మరోసారి రుజువైంది. వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ లో నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఆడేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన స్టార్ ఆట‌గాళ్లు వీరే!

విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ మూవీ..విడుదల తర్వాత మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని , చాలామంది టికెట్స్ దొరకక వెనుతిరుగుతున్నారని తెలిపారు.

ఇదిలా ఉంటె ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్నట్లు డైరెక్టర్ అనిల్ తెలిపి అభిమానుల్లో సంతోషం నింపారు. ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకు ఆ స్పేస్ ఉంది. రాజమండ్రిలో ఎండ్ అయింది కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ కావొచ్చు. మరో మిరాకిల్ సృష్టిస్తామేమో’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఈ సీక్వెల్ ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. గతంలో ఎఫ్ 2 కు ఎఫ్ 3 తెరకెక్కించి హిట్ అందుకున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anil ravipudi
  • Sankranthiki Vasthunnam
  • sankranthiki vasthunnam sequel

Related News

Grand Launch of Venky-Kalyan Ram Multi-starrer Anil Ravipudi: Venky and Kalyan Ram in Anil Ravipudi's Multi-starrer

Venkatesh Kalyan Ram: అనిల్ రావిపూడి వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గ్రాండ్ లాంచ్

టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తి రేపుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి ఈరోజు అధికారికంగా అంకురార్పణ జరిగింది. విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్ వంటి సినీ ప్రమ

    Latest News

    • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

    • Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

    • Live Kitchen: హైదరాబాద్ లో ‘లైవ్ కిచెన్’ ఆవిష్కరణ

    • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd