Sania Mirza and Salman Khan: సల్మాన్ తో సానియా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఆటతీరుతో అందర్ని ఆకర్షిస్తే.. ప్రస్తుతం రూమర్స్ తో హాట్ టాపిక్ గా మారుతోంది.
- By Balu J Published Date - 01:41 PM, Wed - 23 November 22
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఒకప్పుడు తన ఆటతీరుతో అందర్ని ఆకర్షిస్తే.. ఇప్పుడు రూమర్స్ తో హాట్ టాపిక్ గా మారుతోంది. సానియా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్నారనే వార్తలు రెండు వారాలుగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్త ఇంటర్నెట్లో కనిపించినప్పటి నుంచి ఏదైనా అఫిషీయల్ గా అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అనేక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె భర్త షోయబ్ ఓ నటితో నటించిన ఫోటోషూట్ మరింత అనుమానాలకు తావిచ్చింది.
ఈ నేపథ్యంలో సానియా మీర్జాకు సంబంధించిన ఫొటోలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సందడి చేసిన సానియా ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ బాలీవుడ్ నటి ఈ ఇద్దరి ఫొటోలను ఇన్ స్టా లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.
“మెమోరీస్ ఆఫ్ హ్యాపీ టైమ్స్ @మిర్జాసానియా @బీయింగ్ సల్మాన్‌ఖాన్” అని క్యాప్షన్ ఇచ్చింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఫ్యాన్స్ ఎమోజీలతో రియాక్ట్ అయ్యారు బాలీవుడ్ ఫ్యాన్స్. సానియా నేరుగా బాలీవుడ్‌కి కనెక్ట్ కానప్పటికీ.. పరిణీతి చోప్రా, ఫరా ఖాన్, నేహా ధూపియా, SRK లాంటి స్టార్స్ తో ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తోంది. సానియా మీర్జా కేవలం సల్మాన్ తోనే కాకుండా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తోనూ క్లోజ్ గా ఉన్న ఫొటోలు కూడా ఆకర్షించాయి. ఈ ఫొటోలను పోస్ట్ చేసిన నటి బీనా సల్మాన్ తో కలిసి పనిచేయడం గమనార్హం.
Related News
Shahid Kapoor : హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్ వైపు బాలీవుడ్ హీరోలు.. వంశీ పైడిపల్లితో షాహిద్..
హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్ వైపు బాలీవుడ్ హీరోలు. మొన్న షారుఖ్, రణ్‌బీర్. ఇప్పుడు సల్మాన్, షాహిద్.