Prabhas : అర్జున్ రెడ్డి తరువాత సందీప్ వంగని పిలిచి ఆఫర్ ఇచ్చిన ప్రభాస్.. కానీ దర్శకుడు నో..
స్వయంగా ప్రభాస్ సందీప్ వంగని పిలిచి మరి ఆఫర్ ఇస్తే కాదన్నాడట. ఈ విషయాన్ని ఆ దర్శకుడే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగింది..?
- Author : News Desk
Date : 09-04-2024 - 10:43 IST
Published By : Hashtagu Telugu Desk
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు ఎదురు చూస్తుంటారు. ఒక చిన్న ఆఫర్ వచ్చినా వదులుకోకూడదు అని కలలు కంటుంటారు. కానీ దర్శకుడి సందీప్ రెడ్డి వంగకి ఆ ఆఫర్ ఎదురెళ్లి నిలబడింది. స్వయంగా ప్రభాస్ సందీప్ వంగని పిలిచి మరి ఆఫర్ ఇస్తే కాదన్నాడట. ఈ విషయాన్ని ఆ దర్శకుడే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగింది..?
అర్జున్ రెడ్డి తరువాత ప్రభాస్ నుంచి సందీప్ వంగకి ఒక ఆఫర్ వెళ్లిందట. హాలీవుడ్ లో సూపర్ హిట్ ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామని ప్రభాస్ అడిగారట. అయితే అందుకు సందీప్ వంగ నో చెప్పారు. “రీమేక్ కథలు ఎందుకు ఒరిజినల్ కథతోనే వెళ్దాం. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఒక మంచి పాయింట్ వస్తే, మీకు వచ్చి చెబుతాను” అని చెప్పారట సందీప్ వంగ. ఆ తరువాత యానిమల్ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో ఒక ఐడియా వచ్చిందట.
ఆ ఐడియాని వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్లి చెప్పారు. ఆయనకి అది బాగా నచ్చేసి సినిమా చేయడానికి ఓకే చెప్పేసారు. అలా ఓకే చెప్పిన కథే ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు 60 శాతం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని, నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెడతామని సందీప్ వంగ చెప్పుకొచ్చారు.
HOLLYWOOD FILM REMAKE 😳😳😳😳😳
Guess the Film ✅#Prabhas #SandeepReddyVanga pic.twitter.com/P7FHnLCHHV
— GetsCinema (@GetsCinema) April 8, 2024
ఈ సినిమాలో ప్రభాస్ ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నారు. లోపల అగ్నిపర్వతం పేలుతున్న బయటకి సైలెంట్ గా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఒక తప్పు జరిగినప్పుడు.. ఆ పోలీస్ ఆఫీసర్ ఎంత పవర్ ఫుల్ గా రియాక్ట్ అయ్యాడు అనేది సినిమా కథ. ఇక ఈ రియాక్షన్ ని చాలా ఎఫెక్టీవ్ గా చూపించబోతున్నట్లు సందీప్ వంగ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్లు సందీప్ వంగ వెల్లడించారు.
Also read : Kajal: ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ మూవీ.. రేపట్నుంచే స్ట్రీమింగ్