HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sammelanam Web Series Release In Ott

Sammelanam : ఓటీటీలో ‘సమ్మేళనం’ వెబ్ సిరీస్ రిలీజ్

ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జొప్పించలేదు. దర్శకుడికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది. క్లీన్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన విధానం ఆకట్టుకుంది.

  • Author : Latha Suma Date : 20-02-2025 - 6:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
'Sammelanam' web series release in OTT
'Sammelanam' web series release in OTT

Sammelanam : ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన ‘సమ్మేళనం’ సిరీస్ ఈటీవీ విన్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలో బాగానే ట్రెండ్ అవుతోంది.

ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో సునయని. బి, సాకెత్. జె నిర్మాతలుగా తరుణ్ మహాదేవ్ తెరకెక్కించిన సిరీస్ ‘సమ్మేళనం’. ప్రస్తుతం ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. కొత్త మొహాలతో ఇలాంటి సున్నితమైన అంశాలను జోడించి డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ సిరీస్‌ను అద్భుతంగా మలిచాడు. ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జొప్పించలేదు. దర్శకుడికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది. క్లీన్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన విధానం ఆకట్టుకుంది.

Read Also:ASSOCHAM : అసోచామ్, తెలంగాణ ప్రభుత్వం ఏఐ & సెక్యూరిటీ సదస్సు

ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మూడో ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ క్లీన్ సిరీస్‌కు శ్రావణ్ జీ కుమార్ విజువల్స్, శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ సంగీతం ప్రధాన బలం. మరీ ముఖ్యంగా శరవణ వాసుదేవన్ బీజీఎం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

కాలేజీ రోజుల్లో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతాడు. స్వచ్ఛమైన ప్రేమను పొందుతాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల స్నేహితులు అందరికీ ఆ యువకుడు దూరమవుతాడు. ఆ తర్వాత తన కాలేజీ డేస్‌లోని మధుర జ్ణాపకాలను పంచుకుంటూ ఒక పుస్తకం రాస్తాడు. దాని పేరే సమ్మేళనం. మరి ఆ పుసక్తం దూరమైన స్నేహితులను ఎలా ఒక్కటి చేసింది? అనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఫుల్ యూత్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

కాగా, దర్శకుడు. హీరో.. రచయిత అని, ఈ కథ తన కోణంలోనే సాగుతుందని ప్రారంభ సన్నివేశంతోనే క్లారిటీ ఇచ్చేశారు. కానీ, మిగిలిన పాత్రల పరిచయానికి చాలా సమయం తీసుకున్నారు. పేపర్‌లో రామ్‌ను చూసి ఆనందంలో మునిగిపోయిన శ్రేయ.. ఇంటి పనిమనిషి (జీవనప్రియ రెడ్డి)కి తమ స్నేహితుల గురించి చెప్పే ఫ్లాష్‌బ్యాక్‌తో అసలు కథ మొదలవుతుంది. అలా శ్రేయ గత జ్ఞాపకాలు పంచుకుంటుంటే.. మధ్యమధ్యలో తర్వాతేంటి? అంటూ ఆసక్తి కనబరిచే పనిమనిషి ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది. ఆ గ్యాంగ్‌లో ఒకరితో ఒకరికి ఉన్న సంబంధమేంటో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లోనే అర్థమవుతుంది.

Read Also: Mahashivratri 2025: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Etv Win
  • ott
  • Sammelanam
  • web series
  • web series review

Related News

Bhagavanth Kesari Trends on OTT After Jana Nayagan

జన నాయకుడు మూవీ ఎఫెక్ట్‌తో మ‌ళ్లీ ట్రెండింగ్‌లోకి భ‌గ‌వంత్ కేసరి..

Bhagavanth Kesari Trends on OTT After Jana Nayagan తమిళ స్టార్ విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) సంక్రాంతికి వస్తోంది. ఇది బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని ట్రైలర్ తో స్పష్టమైంది. దీంతో ‘భగవంత్ కేసరి’ ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చి, తమిళ ప్రేక్షకులు కూడా చూసేస్తున్నారు. మరోవైపు ‘జన నాయకుడు’ ట్రైలర్ పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు తమిళ హీరో విజయ్‌ కెరీర్ లో ఆ

  • Akhanda 2 Thaandavam Ott

    బాలయ్య అఖండ 2 ఓటిటి డేట్ ఫిక్స్..

Latest News

  • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

  • రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ఐసీసీ చైర్మ‌న్‌!

  • టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..

  • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

Trending News

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd