Samantha-Raju Nidimoru : రెడ్ హ్యాండెడ్‌గా అతడితో దొరికిపోయిన సమంత
Samantha-Raju Nidimoru : ప్రత్యేకంగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోల్లో రాజు నిడుమోరు సమంతతో కలిసి కనిపించడం, ఇద్దరూ పికిల్ బాల్ ఆడుతూ కెమెరాకు చిక్కడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది
- By Sudheer Published Date - 02:55 PM, Sun - 1 June 25

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) జీవితంలో మరో మలుపు తిరిగిందా అనే చర్చ ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుండగా, ఇటీవల ఆమె రెండో పెళ్లి విషయమై తెగ ప్రచారం జరుగుతోంది. సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజు నిడుమోరు(Samantha-Raju Nidimoru)తో ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో కలిసి పని చేసిన తరువాత, ఇటీవల ‘సిటాడెల్’ సిరీస్ గానూ వీరిద్దరి కలిసి పనిచేయడం ఈ ప్రచారాలకు మరింత బలం ఇచ్చింది.
Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి
ఇటీవల సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలలో రాజ్ ఉండడం వీరి ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. ప్రత్యేకంగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోల్లో రాజు నిడుమోరు సమంతతో కలిసి కనిపించడం, ఇద్దరూ పికిల్ బాల్ ఆడుతూ కెమెరాకు చిక్కడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా రాజు భుజంపై సమంత వాలిన ఫొటో వైరల్ కావడంతో “ఇద్దరి మధ్య బంధం ఖచ్చితమే” అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే విషయం పక్కా అని భావిస్తున్నారు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లయింది. తాజా సమాచారం మేరకు ఆయన త్వరలో తన భార్యకు విడాకులు ఇచ్చి సమంతను పెళ్లి చేసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పటికే ‘శుభం’ అనే చిత్రానికి సమంత నిర్మాతగా వ్యవహరించగా, రాజు నిడుమోరు కూడా ఆ సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా ముందుండటం ఈ వార్తలకు ఊతమిస్తున్నది. ఈ బంధం నిజంగా ప్రేమగా మారిందా? పెళ్లి వరకు వెళుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తెలిసే అవకాశముంది.