Samantha Divorce Story: కాఫీ విత్ కరణ్ షోలో సమంత విడాకుల గురించి పూసగుచ్చినట్టు చెప్పేసిందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
- By Nakshatra Updated On - 10:38 AM, Wed - 22 June 22

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సమంత,నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత కెరీర్ పరంగా స్పీడ్ ను పెంచేసింది. ప్రస్తుతం చేతి నిండా వరస ప్రాజెక్టులతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. తెలుగు తమిళ భాషల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజిలో మారుమోగిపోయిందో మనందరికీ తెలిసిందే.
విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆమె విడాకుల విషయంలో కొంతమంది మితిమీరి కామెంట్స్ చేసిన వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతోంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా మరొక్కసారి విడాకుల విషయం పై స్పందించిన సమంత. ఇక తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించింది సమంత అమ్మాయిలపై ఏవైనా పుకార్లు వస్తే అవి కచ్చితంగా నిజమని నమ్ముతారు.
అదే అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం, వాటిని అమ్మాయి చేయించింది అంటారు. ఇప్పటికైనా ఎదగండి. మేము పాత జ్ఞాపకాలను మరిచిపోయి మూవ్ ఆన్ అవుతున్నాం. మీరు కూడా ముందుకువెళ్లండి. మీరు చేస్తున్న పనిపై, మీ కుటుంబాలపై దృష్టిసారించండి అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గత కొద్ది రోజుల క్రితం సామ్ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోంది. కాతువాకుల రెండు కాదల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా సామ్ ఆ షోలో పాల్గోంది. ఈ క్రమంలో ఆ షోలో సామ్ విడాకులపై మరోసారి స్పందించిందని అందుకు గల కారణాలను సామ్ చెప్పినట్లుగా వార్తలు బీటౌన్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జూలై 7న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి నిజంగానే సామ్ తన విడాకుల పై స్పందించిందా ? లేదా ? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
Related News

Gautham Raju : విషాదంలో టాలీవుడ్… ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు (68) కన్నుమూశారు. గౌతమ్‌రాజు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న(మంగళవారం) ఆయన మరణించారు. గౌతమ్ రాజు మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. దీనితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార