Samantha The Queen: సమంత ది క్వీన్.. లేటెస్ట్ పిక్ వైరల్!
సమంత మరో లుక్ ఫ్యాన్స్ ను మరింత అట్రాక్ట్ చేస్తోంది. అచ్చం యువరాణిలా కనిపించి ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.
- By Balu J Published Date - 02:52 PM, Tue - 31 January 23
ఇటీవలనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ యశోదతో ఆకట్టుకున్న సమంత (Samantha) శాకుంతలం మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లుక్స్, ట్రైలర్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సమంత మరో లుక్ ఫ్యాన్స్ ను మరింత అట్రాక్ట్ చేస్తోంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ను గొప్పగా చిత్రీకరించాలనుకునే ఈ డైరెక్టర్ శాకుంతలం (Shaakuntalam) వంటి పౌరాణిక ప్రేమగాథను ఎలా తెరకెక్కించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో సహజంగా అనిపించాలనే ఉద్దేశంతో ఒరిజినల్ నగలను ఉపయోగించారట. వీటి విలువ రూ.3 కోట్లు అని సమాచారం. నీతా లూల్లా స్టైలిష్‌గా వ్యవహరించింది.
సమంత (Samantha) శాకుంతలం సినిమా కోసం ఉపయోగించిన నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారు. యువరాణిగా (The Queen) శకుంతలను చూపించే క్రమంలో సహజత్వం కోసం ఒరిజినల్ నగలను ఉపయోగించారట. సినిమాలో సమంత చీరను ఒరిజినల్ ముత్యాలను పొదిగి చేయించారు. 30 కిలోల బరువుండే ఈ చీరను సమంత (Samantha) ఏడు రోజుల పాటు ధరించి షూటింగ్‌లో పాల్గొన్నారట. కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలం సినిమాను తెరకెక్కించారు గుణ శేఖర్ (Gunashekar). ‘శాకుంతలం’. సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read: Prabhas and Hrithik: పఠాన్ ఎఫెక్ట్.. బాలీవుడ్ లో మరో భారీ మూవీ.. ప్రభాస్ తో హృతిక్!