Samantha: హమ్మయ్య ఎట్టకేలకు సినిమాలు మొదలుపెట్టిన సమంత.. నెట్టింట ఫోటోస్ వైరల్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
- By Nakshatra Published Date - 08:30 AM, Wed - 31 January 24
![Samantha: హమ్మయ్య ఎట్టకేలకు సినిమాలు మొదలుపెట్టిన సమంత.. నెట్టింట ఫోటోస్ వైరల్?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/01/MixCollage-31-Jan-2024-08-02-AM-7361.jpg)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గత ఏడాది ఆమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్ సమయంలో దాదాపు సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుపుతూ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది సమంత. ఇక చెప్పినట్టుగానే అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యం విషయంలో పూర్తిగా జాగ్రత్తలు వహిస్తూ వస్తోంది. అలాగే తన బిజినెస్ లపై కూడా ఫోకస్ చేయాలని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది. సమంత చివరగా ఖుషి సినిమాతో ప్రేక్షకులని పలకరించింది.
కాగా సమంత ఖుషి సినిమా తర్వాత ముందుగా ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన అడ్వాన్సులను కూడా వెనక్కి ఇచ్చేసి మరి లాంగ్ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సామ్ ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడి మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం సమంత చేతిలో కొత్త సినిమాలు ఏమి లేవు. గతంలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ అనే ఒక సిరీస్ చేసింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కి రీమేక్ గా ఇండియన్ వర్షన్ లో ఇది తెరకెక్కిందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయింది. సిరీస్ షూటింగ్ అయిపోయినా సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ సిరీస్ అక్కడే ఆగిపోయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా సమంత అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ సిటాడెల్ సిరీస్ డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టింది సమంత. సిటాడెల్ కి డబ్బింగ్ చెప్తున్న ఫొటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సమంత. అలాగే రాజ్ & డీకే టీంతో ల్యాప్ టాప్ లో సిటాడెల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న పలు ఫోటోలని కూడా షేర్ చేసింది సమంత. ఈ ఫోటోలని షేర్ చేస్తూ 22 నెలల తర్వాత ఈ ప్రాజెక్టు రెడీ అయింది అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ సిటాడెల్ సిరీస్ యాక్షన్, రొమాంటిక్ గా ఉండనున్నట్టు సమాచారం. ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ లో రానుంది. మళ్ళీ సమంత ఈ సిటాడెల్ సిరీస్ తోనే ప్రేక్షకులని పలకరించనుంది. దీంతో సమంత ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Samantha : సినిమా కోసం సమంత ఏం చేయబోతుంది..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Samantha-Ma-Inti-Bangaram-PAN-India-Release-Plan-1.jpg)
Samantha : సినిమా కోసం సమంత ఏం చేయబోతుంది..?
సిటాడెల్ (Citadel) సీరీస్ షూటింగ్ పూర్తి కాగా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఐతే సమంత నిర్మాణంలో వస్తున్న బంగారం సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. సినిమా లో సమంత డిఫరెంట్ గా