Heroines Remunerations: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన సాయి పల్లవి,రష్మిక, సమంత.. ఒక్కో మూవీకి ఏకంగా అన్ని కోట్లా?
హీరోయిన్ లు సాయి పల్లవి, రష్మిక మందన, సమంత ముగ్గురు రెమ్యూనరేషన్ భారీగా పెంచేసి నట్లు తెలుస్తోంది. మరి ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:00 PM, Mon - 10 March 25

హీరోల రెమ్యునరేషన్ తో పోల్చుకుంటే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. హీరోలా రెమ్యూనరేషన్ రెండు అంకెలు మూడంకెల సంఖ్యలో ఉంటే హీరోయిన్ల రెమ్యూనరేషన్ మాత్రం సింగిల్ డిజిట్ లో ఉంటుందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో హీరోలు మాత్రమే కాదండోయ్ హీరోయిన్లు కూడా రెమ్యూనరేషన్ లను భారీగా పెంచేస్తున్నారు. బాలీవుడ్ లో అయితే హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు సక్సెస్ లో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్స్ భారీగా రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. మరి ఏ ఏ హీరోయిన్ ఎంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు అన్న విషయానికి వస్తే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతుంది సాయి పల్లవి. సాయి పల్లవి నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇటీవల విడుదలైన అమరన్ తండేల్ సినిమాలు కూడా మంచి సక్సెస్ను సాధించిన విషయం తెలిసిందే. కాగా తండేల్ సినిమాకు 5 కోట్ల రెమ్యునరేషన్స్ అందుకుందట. ఇప్పుడు బాలీవుడ్ లో సాయి పల్లవి రామాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏకంగా సాయి పల్లవి 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇది భారీ సినిమా, బాలీవుడ్ సినిమా, తనదే మెయిన్ సీత పాత్ర కావడంతో సాయి పల్లవికి ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారట.
అలాగే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత కూడా రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటుందట. గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కి 3 కోట్లు తీసుకుందని వార్తలు వచ్చాయి. యశోద లేడీ ఓరియెంటెడ్ సినిమాకు, ఖుషి సినిమాకు కూడా 3 కోట్లు తీసుకుంది అన్నారు. ఇటీవల బాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం సమంత 8 కోట్లు తీసుకుందట. ఇప్పుడు సమంత చేతిలో బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ ఉంది. ఈ సిరీస్ మొత్తానికి సమంత ఏకంగా 10 కోట్లు తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం సమంతకు మార్కెట్ లేకపోయినా సిరీస్ లు కాబట్టి ఆ రేంజ్ లో ఇస్తున్నారట.
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన. ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలో నటించిన కూడా ఆ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే మొన్నటిదాకా రష్మిక 2 నుంచి 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేది. ఇటీవల ఛావా సినిమాలో చిన్న పాత్రే అయినా 4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. పుష్ప 2 సినిమాలకు కలిపి 10 కోట్లు ఇచ్చారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇప్పుడు రష్మిక 4 నుంచి 5 కోట్లు తీసుకుంటుందని సమాచారం.