Samantha or Keerthy: రెచ్చిపోయిన సమంత, కీర్తి.. బోల్డ్ లుక్స్ లో ఎవరు బెస్ట్!
హీరోయిన్స్ అంటేనే గ్లామర్, యాక్టింగ్ కు కేరాఫ్ అడ్రస్. అందుకే ఏ మాత్రం సమయం దొరికినా ఫోట్ షూట్ చేస్తూ అలరిస్తుంటారు.
- By Balu J Published Date - 05:13 PM, Mon - 5 September 22

హీరోయిన్స్ అంటేనే గ్లామర్, యాక్టింగ్ కు కేరాఫ్ అడ్రస్. అందుకే ఏ మాత్రం సమయం దొరికినా ఫోట్ షూట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. స్టైల్ అనేది హీరోయిన్లకు చాలా కామన్ పాయింట్ గా మారింది. ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు తమకు నచ్చినట్టుగా ఫొటోలకు ఫోజలిస్తూ మత్తెక్కిస్తున్నారు. అలాంటివాళ్లలో సమంత, కీర్తిసురేష్ ఒకరు. సెలబ్రిటీలు సిల్వర్ మెటాలిక్ డ్రెస్‌ల పై ఇష్టం పెంచుకుంటున్నారు. ఇటీవల కీర్తి సురేష్ మెటాలిక్ దుస్తులు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ప్రస్తుతం పిక్స్ సోషల్ మీడియాలో నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
డిజైనర్ లాంచ్ కలెక్షన్ కోసం సమంత కూడా అదే దుస్తులను ధరించింది. ఆమె హాట్ గా కనిపించింది. సామ్ కూడా బ్రాంజ్ హ్యూడ్ మేకప్ తో గోధుమరంగు లిప్ స్టిక్ వేసుకుంది. మెరిసే అందంతో అభిమాలను మెస్మరైజ్ చేసింది. అయితే సామ్, కీర్తి సురేష్ అందంగా కనిపించారు. ఈ ఇద్దరిలో ఎవరు బోల్డ్ లుక్స్ లో కనిపించారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి లో ఎవరు బెస్ట్ అనేది అభిమానులే నిర్ణయిస్తారు మరి.