Samantha on Nayantara: నయనతారపై సమంత సెన్సెషనల్ కామెంట్స్..అలా ఎవరు లేరట..!!
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది.
- By Hashtag U Published Date - 07:00 AM, Sat - 30 April 22
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. పుష్పలో ఐటం సాంగ్ ద్వారా తన సత్తా చాటిన సమంత, ఇప్పుడు తమిళ్ లో KRK చిత్రంలో తళుక్కుమంది. అంతేకాదు ఈ సినిమాలో నయనతారతో కలిసి కామెడీ పండించింది.
కోలివుడ్ లో సమంతకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే, ఈ అమ్మడు అటు నయనతారతో కలిసి కేఆర్కే చిత్రంలో నటించడంతో అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఈ ఇద్దరు కోలీవుడ్ భామలు కాతువాకుల రెండు కాధల్ (కన్మణి రాంబో ఖతిజా) సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి రొమాన్స్ చేయడం మరో అద్భుతం అనే చెప్పాలి. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతోంది.
ఈ సందర్భంగా సామ్ ట్విట్టర్లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. నయనతార గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ..’నయనతారలా ఎవరూ ఉండరు. నేను కలిసిన వ్యక్తుల్లో వాస్తవానికి దగ్గరగా, ఎంతో విధేయత కలిగిన కష్టపడే వ్యక్తుల్లో ఆమె ఒకరు’ అంటూ సామ్ సమాధానమిచ్చింది
కేఆర్కే సినిమాలో సామ్, నయనతార, విజయ్ సేతుపతి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలోని శకుంతల సినిమాతో పాటు, యశోద అనే మరో సినిమాలో నటిస్తోంది. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ లవ్ స్టోరీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంబంధించిన బర్త్ డే టీజర్ యూట్యూబ్ లో విడుదలైంది.
Related News
Samantha: అల్లుఅర్జున్ పై భారీ ఆశలు పెట్టుకున్న సమంత.. ఎందుకంటే
Samantha: ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ సమంత రూత్ ప్రభు వ్యూహాత్మకంగా వెండితెరకు రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమాలో ఈ టాలెంటెడ్ నటి నటిస్తున్నట్లు సమాచారం. పవర్ ఫుల్ రీఎంట్రీ ఇచ్చే సినిమా కోసం చూస్తున్న సమంత, అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే నెక్ట్స్ మూవీ తనకు బెస్ట్ ఛాయిస్ అని నమ్ముతోంది. అల్లు అర్జున్ కు పా�