Samantha : విశ్వంభర ఛాన్స్ మిస్ చేసుకున్న సమంత.. ఆమె ప్లేస్ లో ఆ హీరోయిన్ ని తీసుకున్నారా..?
Samantha మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో మెగా 156వ సినిమాగా వస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమాలో చిరు సరన త్రిష, అనుష్క, మీనాక్షి చౌదరిలు
- By Ramesh Published Date - 12:09 PM, Tue - 13 February 24
![Samantha : విశ్వంభర ఛాన్స్ మిస్ చేసుకున్న సమంత.. ఆమె ప్లేస్ లో ఆ హీరోయిన్ ని తీసుకున్నారా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/10/Close-Friends-Big-Hand-to-Samantha-The-Girl-Friend-Movie.jpg)
Samantha మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో మెగా 156వ సినిమాగా వస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమాలో చిరు సరన త్రిష, అనుష్క, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. విశ్వంభర సినిమా అనుకున్న టైం లోనే సమంతని ఈ ప్రాజెక్త్ లో భాగం చేయాలని అనుకున్నారట.
అయితే సమంత ఈమధ్య కొన్నాళ్లుగా తన హెల్త్ బాగాలేదని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తెలుగులో విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి తర్వాత ఆమె మరో సినిమాకు సైన్ చేయలేదు. ఆ టైం లో సమంతకు చిరు విశ్వంభర ఛాన్స్ వచ్చినా చేయలేనని చెప్పేసిందట. సమంత ఈ సినిమాలో భాగం అయితే ఆ ప్రాజెక్ట్ కి కూడా ఎంతోకొంత హెల్ప్ అయ్యేది.
కానీ సమంత ఇప్పుడప్పుడే సినిమాలో నటించే అవకాశం లేదని చెప్పేసింది. కానీ లేటెస్ట్ గా మళ్లీ నటించేందుకు సిద్ధం అవుతున్నా అని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సమంత. సమంత మళ్లీ సినిమాలు చేయడం ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. అయితే మెగా ఆఫర్ ని కాదన్నదుకు బాధ పడుతున్నారు.
సమంత కాదన్న ఈ ఛాన్స్ అనుష్క దక్కించుకుందని తెలుస్తుంది. ఇప్పటికే విశ్వంభర సెట్ లో త్రిష అడుగు పెట్టింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ త్రిష కాగా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారని తెలుస్తుంది. చిరు విశ్వంభర సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Rashmika Mandanna : రష్మిక రెయిన్ బోకి అడ్డొచ్చిన కారణాలు ఏంటి..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Krishna Vamsy : సీక్వెల్స్ నచ్చవు.. కృష్ణవంశీ ఇలా అనేశాడేంటి..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/I-Didnt-Understand-Sequels-Says-Creative-Director-Krishna-Vamsy.jpg)
Krishna Vamsy : సీక్వెల్స్ నచ్చవు.. కృష్ణవంశీ ఇలా అనేశాడేంటి..?
ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ సినిమా గురించి డౌట్లను క్లియర్ చేస్తున్నారు కృష్ణవంశీ. ఇదే క్రమంలో కృష్ణవంశీకి సంబందించిన వేరే సినిమాల గురించి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు.