HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Invokes Shilpa Shettys Example In Her Defamation Case

ఆ విషయంలో శిల్పాశెట్టిని ఫాలో అవుతున్న సమంత!

టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమెపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాల వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

  • Author : Balu J Date : 28-10-2021 - 2:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమెపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాల వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నాయంటూ సమంత కోరుక్కెక్కింది. వ్యక్తిగత జీవితంపై పుకార్లు స్ప్రెడ్ చేసినందుకు పరువు నష్టం కేసు వేశారు. తన పరువు తీశారని ఆరోపించిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమంత చేసిన విజ్ఞప్తిని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టు తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. తన పరువుకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన 3 యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. యూట్యూబ్ ఛానెళ్లు వెంటనే కంటెంట్ తొలగించాలని ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేసింది. అయితే అందుకు అనుగుణంగా తన వ్యక్తిగత విషయాలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని న్యాయస్థానం పేర్కొంది. సమంత వ్యక్తిగత వివరాలూ ఎవరూ ప్రసారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

అయితే శిల్పాశెట్టి ఇటీవల దాఖలు చేసిన ‘శాశ్వత ఇంజక్షన్ ఆర్డర్’ కేసును ఇప్పుడు సమంతా కేసుకు రిఫరెన్స్ పాయింట్‌గా సమంతా తరఫు న్యాయవాది పేర్కొన్నట్లు సమాచారం. తన భర్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు చేయడంతో శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు సంబంధించిన అవమానకరమైన వార్తలను నివేదించకుండా మీడియా సంస్థలను ఆంక్షిస్తూ కోర్టు శాశ్వత నిషేధాజ్ఞను జారీ చేసింది. తన పరువు నష్టం కేసులో కూడా ఇదే విధమైన తీర్పు కోసం సమంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు కోరుకోలేదని, నేను అవకాశవాదినని, అబార్షన్ చేయించుకున్నానని చెప్పారు. విడాకులు అనేది చాలా బాధాకరమైన ప్రక్రియ. దాన్నుంచి బయట పడేందుకు చాలా సమయం పడుతుంది. ఈ కష్టకాలంలో మద్దతు ఇవ్వండి అంటూ సమంత ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • case
  • Heroine samantha
  • Samantha
  • shilpa shetty
  • youtube

Related News

Youtube

ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

YouTube : గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో బుధవారం కొంతసేపు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. లక్షలాది మంది వినియోగదారులకు లాగిన్‌లో ఇబ్బంది, ప్లే కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ యాజమాన్యం వెల్లడించింది. స్ట్రీమింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. రికమెండేషన్ సిస

  • Youtube Down

    Youtube డౌన్..షాక్ లో యూజర్స్

  • Bhopal Family Court

    భర్తను ప్రియురాలికి రూ.1.5 కోట్లకు అమ్మేసిన భార్య

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd