Samantha : న్యూయార్క్ వీధుల్లో చీరతో సమంత మాయ చేసింది
బ్లాక్ చీరలో సామ్ అక్కడి వీధుల్లో తిరుగుతూ అక్కడి వారిని మాయ చేస్తుంది
- By Sudheer Published Date - 07:47 PM, Tue - 22 August 23
న్యూయార్క్ నగర వీధుల్లో సమంత (Samantha) చీర కట్టులో మాయ చేసింది. సమంత అందం గురించి ఎంత చెప్పిన తక్కువే. చీర కట్టిన, మోడ్రన్ డ్రెస్ వేసుకున్న, బికినీ వేసిన ఆమెకే చెల్లింది. మొదటి సినిమాతోనే అందర్నీ మాయ చేసిన సామ్..అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ పొజిషన్ కు వెళ్ళింది. అదే సమయంలో నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకోవడం..ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవడం అంతే స్పీడ్ గా జరిగిపోయింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురి అవ్వడం..చాల రోజుల చికిత్స తర్వాత క్షేమంగా బయటపడడం జరిగింది. అనారోగ్యం నుండి బయటపడిన సామ్..పుష్ప లో ఐటెం సాంగ్ , పలు వెబ్ సిరీస్ లతో పాటు ఖుషి మూవీ చేసింది.
ఖుషి (Kushi) మూవీ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొని సందడి చేసింది. ప్రస్తుతం అమ్మడు న్యూ యార్క్ (New York)వెకేషన్ లో ఉంది. అక్కడి వీధుల్లో తిరుగుతూ ..అక్కడి పిక్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తుంది. బ్లాక్ చీరలో సామ్ అక్కడి వీధుల్లో తిరుగుతూ అక్కడి వారిని మాయ చేస్తుంది. చీర కట్టులో సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. పైటను కాస్త కిందకి లాగి నడుము ఒంపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. చీరకట్టి అందానికే అందం అన్నట్లుగా అట్రాక్ట్ చేసింది సమంత. ఈ ఫొటోస్ (Samantha Hot) చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్ లుక్స్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. గత కొంతకాలంగా సమంత ఎక్స్పోజింగ్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. తన డ్రెస్సింగ్ స్టైల్‌ను.. యాటిట్యూడ్‌ను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ లలో కూడా అలాగే హాట్ హాట్ కనిపిస్తుంది.
Read Also : Chandrayaan-3 : చంద్రయాన్ -3 తో భారత్ చరిత్ర సృష్టించబోతోంది
Related News
Samantha : అతనికి బర్త్ డే విష్ చేసి ఐలవ్యూ చెప్పిన సమంత..!
Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏ చిన్న న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ఎందుకో మీడియాకు ఆమె మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది.