Samantha : సమంత కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు ఈక్వల్ రేంజ్ లో సంతన్ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. సమంత కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇదని తెలుస్తుంది.
- By Ramesh Published Date - 11:16 AM, Thu - 8 August 24

Samantha సౌత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు దూరమైనా డైవర్స్ తర్వాత మళ్లీ సినిమాలు చేయాలని అనుకుంది. ఈలోగా తనకు వచ్చిన మయోసైటిస్ వల్ల అమ్మడు కెరీర్ లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఐతే సమంత కు సౌత్ ఆఫర్లు రాకపోయినా బాలీవుడ్ నుంచి మాత్రం భారీ ఆఫర్లు వస్తున్నాయి. అంతకుముందు ఫ్యామిలీ మేన్ 2 సీరీస్ లో భాగమైన సమంత ఆ సినిమా డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తోనే మరో సీరీస్ చేసింది. హాలీవుడ్ లో వచ్చిన సిటాడెల్ రీమేక్ లో సమంత నటించింది.
వరుణ్ ధావన్ లీడ్ రోల్ లో సమంత ఫిమేల్ లీడ్గా సిటాడెల్ ఇండియన్ వెర్షన్ రెడీ అయ్యింది. ఐతే ఈ సీరీస్ కు సమంత తీసుకున్న రెమ్యునరేషన్ లీక్ అయ్యింది. దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు ఈక్వల్ రేంజ్ లో సంతన్ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. సమంత కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇదని తెలుస్తుంది. సిటాడెల్ కోసం సమంత దాదాపు 10 కోట్ల దాకా పారోషికం అందుకుందని తెలుస్తుంది.
సిటాడెల్ తర్వాత సమంత సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం (Bangaram) సినిమా చేస్తుంది. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా రాజ్ అండ్ డీకే చేయబోతున్న నెక్స్ట్ వెబ్ సీరీస్ లో కూడా సమంత నటించడంతో పాటుగా సహ నిర్మాతగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది. సో కెరీర్ లో మధ్యలో రెండేళ్లు కాస్త జోరు తగ్గించిన సమంత మళ్లీ తన ఫాం కొనసాగిస్తుందని చెప్పొచ్చు.
సమంత మాత్రం తెలుగు నుంచి వస్తున్న ఆఫర్లను హోల్డ్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది. మరి సమంత పూర్తిగా బాలీవుడ్ (Bollywood) కే పరిమితం అవుతుందా సౌత్ ఆడియన్స్ ని పట్టించుకోదా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read : Sunita Williams : సునీతా విలియమ్స్..ఇప్పట్లో రావడం కష్టమేనా..?