Samantha Vacation: సముద్ర తీరంలో సమంత, బాలి వెకేషన్ లో బ్యాక్ అందాలతో భలే ఫోజులు!
సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు ప్రకటించిన తర్వాత సమంత తనదైన శైలిలో రోజులను ఆస్వాదిస్తోంది.
- By Balu J Published Date - 11:56 AM, Mon - 31 July 23

సమంత తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు ప్రకటించిన తర్వాత సమంత తనదైన శైలిలో రోజులను ఆస్వాదిస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి టూర్లకు వెళ్తూ లైఫ్ ను ఓ రేంజ్ లో ఆస్వాదిస్తోంది. ఇప్పటికే బాలిలో నేచర్, పచ్చని పరిసరాలను ఎంజాయ్ చేస్తూ రిచార్జ్ అవుతోంది. తాజాగా ఈ బ్యూటీ సుందరమైన బీచ్‌లో ఫోటో సెషన్ లో మునిగిపోయింది.
సొగసైన భంగిమలు, అవధులు లేని సముద్రం వైపు ఆలోచనాత్మకమైన చూపులు సమంతలోని ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ ఫొటోల్లో సమంత తన బ్యాక్ అందాలను ప్రదర్శించి అభిమానులను ఫిదా చేసింది. అదిరె డ్రస్సింగ్ స్టయిల్ తో ఆకట్టుకుంది. తన వృత్తిపరమైన కమిట్‌మెంట్‌ను దాదాపు పక్కన పెట్టి, ఫిట్‌నెస్ దినచర్యను చురుకుగా నిర్వహిస్తోంది. ఫిట్‌గా ఉండటానికి ఆమె అంకితభావాన్ని ప్రదర్శిస్తూ ఆమె వర్కౌట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక సమంత కొన్ని అన్ని సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా బాలీ వెళ్లారు. అక్కడ తన ఫ్రెండ్‌తో అక్కడి ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. తన ఫ్రెండ్ అనూష స్వామితో అక్కడి బీచుల్లో తిరుగుతూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: SPY Movie: నిఖిల్ పాన్ ఇండియా క్రేజ్.. ఓటీటీలో దూసుకుపోతున్న SPY మూవీ