Samantha : రవితేజ సినిమాలో సమంత?
Samantha : టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ రూపుదిద్దుకోబోతోందనే సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాస్ మహారాజా రవితేజ, భావోద్వేగ కథలతో గుర్తింపు పొందిన దర్శకుడు శివ నిర్వాణ కలిసి ఓ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారనే
- By Sudheer Published Date - 12:16 PM, Mon - 17 November 25
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ రూపుదిద్దుకోబోతోందనే సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాస్ మహారాజా రవితేజ, భావోద్వేగ కథలతో గుర్తింపు పొందిన దర్శకుడు శివ నిర్వాణ కలిసి ఓ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం బలంగా నడుస్తోంది. రవితేజ కెరీర్‌లో ప్రతి కొత్త ప్రయత్నం చర్చనీయాంశం అవుతుండగా, శివ నిర్వాణ కథలలోని కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ రసాలు ఎప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
CII Summit Vizag : ఈ మూడు పనులు చేస్తే ఏపీ సూపర్..చంద్రబాబుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.!
ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా సమంతను సంప్రదించినట్లు పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మజిలీ, ఖుషి వంటి సినిమాల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత కీలక పాత్రల్లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. మజిలీ ఆమె కెరీర్‌లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా నిలిచిన సినిమా. మరోసారి శివ – సామ్ కాంబో వస్తుందన్న వార్తలు బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై మూవీ టీమ్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. దర్శకుడు – నటీమణి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయని, వివరాలు త్వరలో వెల్లడవచ్చని సమాచారం.
ప్రస్తుతం రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో బిజీగా ఉండగా, సమంత మా ఇంటి బంగారం చిత్రీకరణలో తలమునకలై ఉంది. ఈ నేపధ్యంలో వీరిద్దరూ ఒకే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ మాస్ ఎనర్జీ, శివ నిర్వాణ భావోద్వేగ కథనాలు, సమంత నటన… ఈ కాంబినేషన్ జరిగితే టాలీవుడ్‌లో మరో విశేషమైన చిత్రం పుడుతుందనే ఆశలు ఆరంభమయ్యాయి. మూవీ టీమ్ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది.