Game Changer : చరణ్ డాన్స్ ఫై సమంత కామెంట్స్..
Game Changer : 'నిన్నెవరూ మ్యాచ్ చేయలేరు అంటూ.. ‘అన్‌మ్యాచ్‌బుల్’ అని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 02:17 PM, Tue - 1 October 24

‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని ‘రా మచ్చా’ సాంగ్ లో చరణ్ చేసిన డాన్స్ ఫై సమంత ప్రశంసల జల్లు కురిపించింది. పాటలో చరణ్ డ్యాన్స్ అన్ మ్యాచబుల్ అంటూ పొగడ్తలలో ముంచెత్తింది. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ”గేమ్ ఛేంజర్” (Game Changer) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా..దీనిని దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఈ మూవీ మొదలుపెట్టి చాల నెలలే అవుతున్న సరైన ప్రమోషన్ చేయకపోవడం పట్ల మేకర్స్ మెగా అభిమానులు ఆగ్రహం గా ఉన్నారు. అదిగో..ఇస్తున్నాం..ఇదిగో ఇస్తున్నాం అని చెప్పడమే కానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం తో సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో చిత్రంలోని సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ (Raa Macha Macha – Song ) ను విడుదల చేసారు.
మొదటి సాంగ్ కాస్త నెగిటివ్ టాక్ రావడం తో సెకండ్ విషయంలో థమన్ జాగ్రత్త పడ్డట్లు సాంగ్ చూస్తే అర్ధం అవుతుంది. ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ (Raa Macha Macha Song) కు థమన్ (Thaman) మంచి మాస్ బిట్స్ అందజేశాడు. ఈ సాంగ్ కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. రామ్ చరణ్ హెలికాఫ్టర్ నుంచి దిగే సీన్ నుంచి చివరి షాట్ వరకు ప్రేక్షకులను అబ్బుర పరిచారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టెప్స్ వారెవ్వా అనిపించాయి. రామ్ చరణ్ గ్రేస్ ఊపు తెచ్చింది. చిరంజీవి కటౌట్ ముందుకు రామ్ చరణ్ వీణ స్టెప్స్ వేసి అడియన్స్‌లో జోష్ నింపారు. ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాటలో రామ్‌చరణ్ డ్యాన్స్‌పై ఉపాసన(Upasana), సమంతలు (Samantha)ప్రశంసలు కురిపించారు.
‘రా మచ్చా మచ్చా.. పాటను రామ్‌చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి ‘ఈ పాటను నేను ఆనందించినట్లు.. మీరూ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నా’ అని రాశారు. ఈ పోస్ట్‌పై ఉపాసన స్పందిస్తూ.. మిస్టర్ సీ.. మీ డ్యాన్స్‌తో హై ఓల్టేజ్ పుట్టించారని రిప్లై ఇచ్చారు. దీనిపై సమంత కూడా స్పందించారు. ‘నిన్నెవరూ మ్యాచ్ చేయలేరు అంటూ.. ‘అన్‌మ్యాచ్‌బుల్’ అని పేర్కొన్నారు. దానికింద ఫార్మల్ ప్యాంట్, షర్ట్ ధరించి ఎవరు ఇలా డ్యాన్స్ చేయగలరు’’ అని సామ్ రాసుకొచ్చారు. రామ్ చరణ్ ప్రతి పోస్ట్‌కు సమంత స్పందిస్తుంటారు. వీరిద్దరూ కలిసి సూపర్‌హిట్ చిత్రం రంగస్థలంలో నటించారు. 2024 క్రిస్మస్ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
Read Also : Religious Structures : రోడ్లను ఆక్రమించి నిర్మించిన మత కట్టడాలను తొలగించాలి : సుప్రీంకోర్టు