Samantha: సల్మాన్ తో సామ్ రొమాన్స్
జవాన్ చిత్రంతో షారుఖ్ ఖాతాలో మరో కమర్షియల్ హిట్ పడింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, దీపికా పడుకునే హీరోయిన్లుగా నటించారు.
- By Praveen Aluthuru Published Date - 01:58 PM, Fri - 15 September 23

Samantha: జవాన్ చిత్రంతో షారుఖ్ ఖాతాలో మరో కమర్షియల్ హిట్ పడింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, దీపికా పడుకునే హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో షారుఖ్, నయన్ జోడి ఆకట్టుకుంది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో వర్కౌట్ అయింది. ఇదిలా ఉండగా బాద్షా మొదటిసారి సౌత్ హీరోయిన్ నయన్ తో జోడి కడితే, సల్మాన్ ఖాన్ కూడా త్వరలో మరో సౌత్ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్నాడట. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్ సరసన సమంత నటించనున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు విష్ణువర్ధన్ సమంతతో చర్చలు కూడా మొదలెట్టేశాడట. ఈ చిత్రంపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. ఈ జోడీని చూసేందుకు అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. సోషల్ మీడియాలో సల్మాన్ , సామ్ ఫొటోలతో వైరల్ చేస్తున్నారు. అయితే సమంతతో పాటు మరో ఇద్దరు సౌత్ హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సల్మాన్ కి జోడిగా త్రిష మరియు అనుష్క శెట్టి నటించనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి సల్మాన్ ఖాన్ సరసన ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూద్దాం.
Also Read: MS Dhoni Gives Lift: యంగ్ క్రికెటర్ కి బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్