Salman Khan : కపిల్ షోలో సల్మాన్ కామెంట్స్ వైరల్.. సంబంధాలపై తనదైన స్టైల్‌లో సల్లు భాయ్
Salman Khan : ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ తన బృందంతో కలిసి “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో” కొత్త సీజన్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
- By Kavya Krishna Published Date - 10:51 AM, Mon - 16 June 25

Salman Khan : ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ తన బృందంతో కలిసి “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో” కొత్త సీజన్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ శాశ్వత అతిథిగా మళ్లీ షోలోకి రీ-ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో మొదటి ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్‌గా హాజరై ప్రేక్షకులను ఉత్సాహంతో ఊపేశారు.
తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సల్మాన్ ఖాన్ తన సిగ్నేచర్ స్టైల్‌లో వినోదం, హాస్యం మేళవించి విడాకులు, సంబంధాల విలువ, సహనం వంటి అంశాలపై సరదాగా వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాటల్లోనే.. “ఇప్పట్లో సంబంధాలు చాలా సులువుగా తెగిపోతున్నాయి. ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసే రోజులు పోయాయి. అప్పట్లో సహనం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు? రాత్రి ఎవరి కాలు ఎవరి మీద పడినా, కొంచెం గురక పెట్టినా చాలు… విడాకులు తీసుకుంటున్నారు. అంతే కాదు, విడాకుల తర్వాత సగం డబ్బు కూడా తీసుకెళ్తున్నారు!” అని హాస్యంగా చెప్పారు సల్మాన్ ఖాన్.
ఈ వ్యాఖ్యలపై ఆడియెన్స్ తో పాటు స్టేజ్ మీదున్న వారూ పగలబడి నవ్వారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అభిమానుల స్పందన కూడా వెల్లువెత్తుతోంది. కొంతమంది సల్మాన్ కామెంట్స్‌కి మద్దతుగా “ఇది 100 శాతం నిజం” అంటూ కామెంట్ చేస్తుండగా, మరికొందరు టిపికల్‌గా సల్మాన్‌నే ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
KTR : రాజకీయ ప్రతీకార చర్యలకు నేను ఎప్పటికీ నిరుత్సాహపడను