Salaar wishing: సలార్ సర్ ప్రైజ్.. శ్రుతిహాసన్ పోస్టర్ రిలీజ్!
శ్రుతిహాసన్.. కేవలం నటనకే పరిమితం కాలేదు. మ్యూజిక్, రైటింగ్స్ లో తన టాలెంట్ ఎంటో చూపిస్తోంది.
- By Balu J Published Date - 02:31 PM, Fri - 28 January 22

శ్రుతిహాసన్.. కేవలం నటనకే పరిమితం కాలేదు. మ్యూజిక్, రైటింగ్స్ లో తన టాలెంట్ ఎంటో చూపిస్తోంది. ఒకప్పుడు సినిమాలే వద్దనుకున్న ఈ బ్యూటీ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. తండ్రికి తగ్గ తనయ అంటూ కమల్ లను మురిపిస్తోంది. తెలుగులో క్రాక్ తో సూపర్ సక్సెస్ అందుకున్న ఈబ్యూటీ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా వరుసగా కొత్త కథలు వింటూ సినిమాల మీద సినిమాలకు సైన్ చేస్తోంది. అయితే గతంలో కుర్రహీరోలతో నటించిన ఈబ్యూటీ సీనియర్ హీరోలతోనూ నటించడానికి ఆసక్తి చూపుతోంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య బాబు సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించనుంది. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టింది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇవాళ తన బర్త్ డే సందర్భంగా సలార్ టీం షాకింగ్ అప్డేట్ ఇచ్చింది. ఆద్యగా పరిచయం తన లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది గనుక, తన కెరియర్ మరింత పుంజుకుంటుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపుతూ వచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండనుంది? ఆమె లుక్ ఎలా ఉండనుంది? అనే ఆసక్తి అందరిలోను ఉంది.
https://twitter.com/prashanth_neel/status/1486919462729125889