Sai Pallavi family Trip: వెకేషన్ లో సాయిపల్లవి.. ఫ్యామిలీమెంబర్స్ తో చిల్!
దక్షిణాదిలోని అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో సాయి పల్లవి ఒకరు.
- By Balu J Published Date - 05:12 PM, Tue - 6 September 22
![Sai Pallavi family Trip: వెకేషన్ లో సాయిపల్లవి.. ఫ్యామిలీమెంబర్స్ తో చిల్!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/09/saipallavi.jpg)
దక్షిణాదిలోని అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో సాయి పల్లవి ఒకరు. గార్గి, విరాట పర్వం, ప్రేమమ్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే సాయిపల్లవి ఫ్యామిలీకి దగ్గరగా ఉండేందుకు ఇష్టపడుతుంది. షూటింగ్స్ బిజీగా ఉండే సాయిపల్లవికి ఏమాత్రం సమయం దొరికినా కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి టూరుకెళ్లింది. ఆ టూర్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “#Familytripafterages #Thiswasspecial.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సీ-గ్రీన్ సల్వార్ సూట్లో ధరించి, స్విమ్మింగ్ పూల్ దగ్గర చెల్లి, తమ్ముడితో కలిసి ఫొటోలకు ఫొజులిచ్చింది. ఆ సమయంలో నవ్వులు చిందిస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సాయిపల్లవిని అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయిపల్లవి పుష్ప సీక్వెల్ లోనూ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.