Sai Dharam Tej : నాకు బ్రేకప్ అయింది.. ప్రేమ, పెళ్లిపై మెగా మేనల్లుడి కామెంట్స్..
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష సినిమా రాబోతుంది.
- Author : News Desk
Date : 14-04-2023 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా మేనల్లుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej). ఆ తర్వాత సుప్రీం హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కి గురయి హాస్పిటల్, ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నాడు. చాలా పెద్ద యాక్సిడెంట్ జరగడంతో కోలుకోవడానికి ఎక్కువ రోజులే పట్టింది. యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం విరూపాక్ష(Virupaksha) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు సాయిధరమ్ తేజ్.
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో విరూపాక్ష సినిమా రాబోతుంది. సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ లో అతీత శక్తులు, దేవుడు, దుష్ట శక్తులు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 21న గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దీంతో కొన్ని రోజులుగా సాయిధరమ్ తేజ్, చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సాయిధరమ్ తేజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి అడగడంతో సాయిధరమ్ తేజ్ సమాధానమిస్తూ.. పెళ్లి చేసుకోను అని చెప్పట్లేదు, కానీ ఎవరో అడుగుతున్నారు కదా అని నేను పెళ్లి చేసుకోను. నాకు నచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. గతంలో ఆల్రెడీ ఓ అమ్మాయిని ప్రేమించాను. కానీ కొన్ని కారణాలతో బ్రేకప్ అయింది. అప్పట్నుంచి అమ్మాయిలు అంటేనే భయమేస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అని తెలిపాడు. దీంతో సాయిధరమ్ తేజ్ తో బ్రేకప్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తున్నారు.
Also Read : Actress Prema : నాకు క్యాన్సర్ వచ్చింది అన్నారు.. నా రెండో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి..