Sai Dharam Tej : ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. మెగా మేనల్లుడి ప్లాన్ అదుర్స్..!
Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశొర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్
- By Ramesh Published Date - 08:36 PM, Fri - 23 February 24
![Sai Dharam Tej : ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. మెగా మేనల్లుడి ప్లాన్ అదుర్స్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/Sai-Dharam-Tej-Chitralahari-Sequal-Planning-Mytri-Movie-Makers.jpg)
Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశొర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. సాయి తేజ్ ఖాతాలో హిట్ సినిమాగా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కిశోర్ తిరుమల ఈ సీక్వెల్ కథను సిద్ధం చేశారట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.
కిశోర్ తిరుమల చివరగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలమైంది. అయితే చిత్రలహరి సినిమా సీక్వెల్ ని మెగా ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా అడుగుతుండగా ఆ కథనే కొనసాగించేలా మరో కథ సిద్ధం చేస్తున్నారట.
నేను శైలజ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన కిశోర్ తిరుమల నుంచి చిత్రలహరి సీక్వెల్ రావడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. సాయి తేజ్ విరూపాక్ష హిట్ అందుకోగా బ్రో సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది.
Also Read : NTR Devara : దేవరకు సమస్యగా మారిన అతను.. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్..!
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![Raviteja Mr Bacchan : మిస్టర్ బచ్చన్ తేడా కొడుతున్న బిజినెస్ లెక్కలు..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/03/Raviteja-Mister-Bacchan-Release-Planing-Harish-Sankar-Perfect-Sketch.jpg)
Raviteja Mr Bacchan : మిస్టర్ బచ్చన్ తేడా కొడుతున్న బిజినెస్ లెక్కలు..!
ఈ సినిమాను రెమ్యునరేషన్స్ అన్నీ కలుపుకుని ముందు 70 కోట్లకు అటు ఇటుగా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.