Shankar : సింగల్ సాంగ్‌ని సంవత్సరం పాటు తీసిన శంకర్.. ఏ పాటో తెలుసా..?
సినిమాలను సంవత్సరాలు పాటు చేసే శంకర్.. ఒక సింగల్ సాంగ్‌ని కూడా సంవత్సరం పాటు చేశారట. ఏ పాటో తెలుసా..?
- By News Desk Published Date - 07:02 PM, Wed - 10 July 24

Shankar : సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ రేంజ్ సినిమాలను ఇండియన్ ఆడియన్స్ కి పరిచేసిన మొదటి వ్యక్తి శంకర్. సినిమా కథ ఎలాంటిది అయినా, టెక్నికల్ గా అద్భుతమైన విజువల్స్ చూపించి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంటారు. అలంటి విజువల్స్ ని తెరకెక్కించడం కోసం సంవత్సరాలు తీసుకుంటుంటారు. శంకర్ ఒక సినిమా అనౌన్స్ చేసారంటే.. అది పూర్తీ కావడానికి కచ్చితంగా ఒకటి రెండు ఏళ్ళు కావాల్సిందే. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే కేవలం ఒక పాటని చిత్రీకరించడం కోసం కూడా సంవత్సరం తీసుకున్నారని మీకు తెలుసా..? ఇంతకీ ఆ పాట ఏంటని ఆలోచిస్తున్నారా..?
సూపర్ స్టార్ రజినీకాంత్ తో శంకర్ తెరకెక్కించిన మొదటి సినిమా ‘శివాజీ’. సోషల్ మెసేజ్ తో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన సంగీతం ఇప్పటికి ఫేవరెట్ లిస్టులో వినిపిస్తూ ఉంటుంది. రెహమాన్ అద్భుతంగా స్వరపరిచిన పాటలను శంకర్ అంతే అద్భుతంగా చిత్రీకరించారు. ఈ పాటల్లో ‘స్టైల్’ అనే పాట అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ పాటలో రజినీకాంత్, హీరోయిన్ శ్రియా కంటే అందంగా కనిపిస్తారు. అలా చూపించడం కోసమే ఆ పాటని ఏడాది చేయాల్సి వచ్చిందట.
రజినీకాంత్ తో శంకర్ ఆ పాటని తక్కువ సమయంలోనే చిత్రీకరించేసారు. అయితే రజినిని కలర్ గా చూపించడం కోసం, ఆ పాటని మరో అమ్మాయితో రీ షూట్ చేశారట. రజిని స్థానంలో ఒక వైట్ స్కిన్ టోన్ అమ్మాయిని పెట్టి షూట్ చేసి, డిజిటక్ క్రాఫ్టింగ్ టెక్నిక్ తో ఎడిట్ చేసి రజినిని శ్రియా కంటే కలర్ గా చూపించారట. ఈ మొత్తం ప్రోసెస్ కి ఏడాది సమయం పట్టిందని స్వయంగా శంకరే తెలియజేసారు.