Rajinikanth: సినిమాలకు రజనీకాంత్ గుడ్ బై..? అయోమయంలో తలైవా ఫ్యాన్స్!
72 ఏళ్ల సూపర్ స్టార్ త్వరలో సినిమాలను గుడ్ బై చెబుతారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
- By Balu J Published Date - 12:06 PM, Sat - 20 May 23

తన యాక్టింగ్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం పలు సినిమాలో బిజీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రజినీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడంతో అభిమానులు ఎగిరి గంతేశారు. ఫుల్ సపోర్ట్ చేశారు. మరికొందరు మాత్రం కేవలం సినిమాల్లో నటించాలని కోరుకున్నారు కూడా. కానీ అన్యూహంగా రజనీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
ఈసారి మాత్రం రజనీకాంత్ శాశ్వాతంగా సినిమాలకు (Industry) గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా రజనీ వెల్లడించాల్సి ఉంది. 72 ఏళ్ల సూపర్ స్టార్ త్వరలో సినిమాలను గుడ్ బై చెబుతారని రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు మిస్కిన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటుడి చివరి చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని, ఆ తర్వాత రజనీకాంత్ సినిమాల నుంచి తప్పుకుంటాడని చెప్పారు.
రజనీకాంత్ త్వరలో సినిమాల నుండి నిష్క్రమించవచ్చని (Quit) మిస్కిన్ వెల్లడించాడు. అయితే మరికొంత మంది అభిమానులు రజనీ ఈసారి పూర్తిగా రాజకీయాల్లోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రజనీ ‘జైలర్’ షూటింగ్‌ను పూర్తి చేసాడు. ఈ చిత్రం ఆగస్టు 11 న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై రజనీ ఏవిధంగా రియాక్ట్ అవుతారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Summer Care: సమ్మర్‌లో హెల్దీగా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాల్సిందే!