Jr NTR Preferred: బాలీవుడ్ వైపు ‘జూనియర్’ చూపు!
ఆర్ఆర్ఆర్, బాహుబలి, సాహో లాంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ ఎన్నో రికార్డులను నెలకొల్పింది.
- By Balu J Published Date - 05:06 PM, Thu - 31 March 22
ఆర్ఆర్ఆర్, బాహుబలి, సాహో లాంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అందుకే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తెలుగు సినిమాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మన తెలుగు హీరోలు పాన్ ఇండియా హీరోలుగా అవతారమెత్తుతున్నారు. ఇతర భాషల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ లో నటిచేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. బాలీవుడ్ చిత్రంలో నటించే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా ‘‘వాస్తవానికి తాను సరైన హిందీ చిత్రంతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా.
భాషలు భిన్నంగా ఉన్నప్పటికీ, ఎమోషన్, డ్రామా ఒకేలా ఉంటాయి. రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ లాంటి దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడతా. రాజ్‌కుమార్ హిరానీ సర్ సినిమాలంటే చాలా ఇష్టం. మనల్ని అద్దం ముందు నిలబెట్టే సినిమాలు తీశాడు. సంజయ్ లీలా బన్సాలీ సినిమాలంటే కూడా ఇష్టం. బలమైన పాత్రలున్నాయి. అతను సినిమాలు తీసే విధానం, అద్భుతమైన కథ కథనాలు బాగా ఆకట్టుకుంటాయి’’ అని ఎన్టీఆర్ అన్నారు. SS రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నటన దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరిని కట్టిపడేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబడుతోంది. రూ. బాహుబలి: ది కన్‌క్లూజన్ (రూ. 358.20 కోట్లు) తర్వాత, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ ఆల్ టైం (రెండో అతిపెద్ద) రికార్డు నమోదు చేసింది. మొదటి మూడు రోజుల్లో సుమారు 348 కోట్లు రాబట్టింది.
Related News
Devara : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆల్ హెయిల్ టైగర్..
'దేవర' ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసిన ఎన్టీఆర్. ఆల్ హెయిల్ టైగర్ అంటూ..