Robinhood : ‘రాబిన్ హుడ్’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది
Robinhood : ఛలో, భీష్మ రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల ఈసారి నితిన్ తో రాబిన్ హుడ్ అంటూ
- By Sudheer Published Date - 09:06 PM, Fri - 14 February 25

Nitin Rabinhood : లవర్ బోయ్ నితిన్ (Nithiin) హీరోగా వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్ (Robinhood ). ఆల్రెడీ భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి కలిసి రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది. ఛలో, భీష్మ రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల ఈసారి నితిన్ తో రాబిన్ హుడ్ అంటూ మరో క్రేజీ సినిమాతో రాబోతున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ తాలూకా పోస్టర్స్ , అప్డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచగా..తాజాగా నేడు శుక్రవారం సెకండ్ సింగిల్ను మూవీ టీమ్ విడుదల చేసింది. ‘వేరెవర్ యు గో’ అంటూ సాగే ఈ సాంగ్ను జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరచగా అర్మాన్ మాలిక్ ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. నితిన్, శ్రీలీల సింపుల్ స్టెప్తో ఆకట్టుకున్నారు. పాట అంతా 90ల నాటి బ్రాండ్స్ కనిపిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 28న విడుదల కానుంది.