Game Changer : ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లపై ఆర్జీవీ సెటైర్లు
Game Changer : తొలి రోజు రూ.186 కోట్లు వసూలు చేస్తే 'పుష్ప-2' రూ.1,860 కోట్లు కలెక్షన్లు రావల్సిందన్నారు
- By Sudheer Published Date - 10:22 AM, Tue - 14 January 25

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గేమ్ ఛేంజర్ (Game Changer ) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటుతాడని అంత ఊహించారు. కానీ తీవ్రంగా నిరాశ పరిచాడు. శంకర్ డైరెక్షన్ , దిల్ రాజు నిర్మాణం అనగానే సినిమా పై హై రేంజ్ అంచనాలు పెట్టుకొని వెళ్లిన అభిమానులకు , ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. కథలో కొత్తదనం లేకపోవడం , సాంగ్స్ పెద్దగా బాగుండకపోవడం , సాగదీత సన్నివేశాలు ఇలా ప్రతిదీ బోర్ కొట్టించాయి. ఇదిలా ఉంటే టాక్ తో సంబంధం లేకుండా సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా (Game Changer Collections) ఏకంగా రూ.186 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు మేకర్స్ అధికారిక ప్రకటించారు. కానీ ఆ తర్వాత రోజుల్లో మాత్రం కలెక్షన్ గురించి మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ కలెక్షన్స్ పై ట్వీట్ చేసి మెగా అభిమానుల్లో ఆగ్రహం నింపారు. తొలి రోజు రూ.186 కోట్లు వసూలు చేస్తే ‘పుష్ప-2’ రూ.1,860 కోట్లు కలెక్షన్లు రావల్సిందన్నారు. గేమ్ ఛేంజర్ కు రూ.450 కోట్ల ఖర్చయితే అద్భుతమైన విజువల్స్ ఉన్న RRR మూవీకి రూ.4,500 కోట్లు ఖర్చయి ఉండాలన్నారు. గేమ్ ఛేంజర్ విషయంలో అబద్ధాలు నమ్మదగినవిగా ఉండాలని పేర్కొన్నారు. అయితే వీటి వెనుక దిల్ రాజు ఉండరని నమ్ముతున్నట్లు రాసుకొచ్చారు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ పై అంత మాట్లాడుకుంటున్నారు.
If G C costed some 450 cr then RRR in its extraordinary never before seen visual appeal should have costed 4500 cr and if G C film’s first day collections are 186 cr on day 1 , then PUSHPA 2 collections should have been 1,860 cr ..The point is that the fundamental requirement of…
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2025