Pawan-Adya Selfie : పవన్ – ఆద్య సెల్ఫీ పై రేణు రియాక్షన్..
'నాన్నతోపాటు స్వాతంత్ర్య దినోత్సవానికి వెళ్లనా?' అని ఆద్య నన్ను అడిగింది. తండ్రితో తగినంత సమయం గడపాలనుకోవడం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది.
- By Sudheer Published Date - 08:03 PM, Thu - 15 August 24

జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కూతురు ఆద్య తో దిగిన సెల్ఫీ (Pawan-Adya Selfie) పిక్ మెగా అభిమానుల్లోనే కాదు సినీ ప్రేక్షకుల్లో సంతోషం నింపుతుంది. ఉదయం నుండి ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కూతురితో పవన్ కళ్యాణ్ ఎంతో ముచ్చటగా ఉన్నారని అంత కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం కామెంట్స్ చేయగా..తాజాగా ఆద్య తల్లి రేణు దేశాయ్ సైతం ఈ పిక్ పై రియాక్ట్ అయ్యింది.
We’re now on WhatsApp. Click to Join.
‘నాన్నతోపాటు స్వాతంత్ర్య దినోత్సవానికి వెళ్లనా?’ అని ఆద్య నన్ను అడిగింది. తండ్రితో తగినంత సమయం గడపాలనుకోవడం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఏపీ ప్రజల కోసం వాళ్ల నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది. ఆయన్ను ప్రశంసించింది’ అని రేణూ తన పోస్ట్ లో పేర్కొంది. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక బద్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన రేణు..ఆ సినిమాతోనే పవన్ కు దగ్గరైంది. ఆ తర్వాత ఇద్దరు సహజీవనం చేయడం..ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం ..ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం..కొంతకాలానికే విడాకులు తీసుకోవడం జరిగిపోయింది. ప్రస్తుతం పవన్..రెండో పెళ్లి చేసుకొని , మరో బిడ్డకు తండ్రియ్యాడు.
ఇక రేణు విషయానికి వస్తే..
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇందులో ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత నటిగా మళ్లీ బిజీ అవుతుందని అంత భావించారు కానీ ఛాన్సులు మాత్రం రావడం లేదో..లేక ఆమె ఇంట్రస్ట్ చూపించడం లేదో తెలియడం లేదు. కానీ సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి ఫొటోస్ అలాగే తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
Read Also : IndiGo: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఇండిగో ఎయిర్‌లైన్స్..!